
జాన్వీ కపూర్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. ఇటీవలే మిలి చిత్రంలో అభిమానులను పలకరించిన జాన్వీ ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అయితే గతంలో జాన్వీ కపూర్‌తో తన మాజీ లవర్ శిఖర్ పహారియాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ఇటీవల ఎక్కడా జంటగా కనిపించలే దు. గతంలో కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గొన్న జాన్వీ పహారియాతో విడిపోయినట్లు చెప్పుకొచ్చింది.
తాజాగా ఈ జంట కలిసి వరుస పార్టీల్లో పాల్గొంటున్నారు. దీంతో పహారియా, జాన్వీ మధ్య సయోధ్య కుదిరిందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో మాజీ లవర్‌తో కలిసి కరణ్ జోహార్ పార్టీలో జాన్వీ కపూర్ పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇద్దరు కలిసి కారులో రావడం కనిపించింది. అంతే కాకుండా ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ఎంగేజ్‌మెంట్ పార్టీలో శిఖర్‌తో జంటగా కనిపించింది. ఇప్పడు అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్‌లతో కలిసి కరణ్ జోహార్ పార్టీకి హాజరైంది. మాజీ లవర్స్ మరోసారి కలవడంతో బీ టౌన్‌లో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment