
బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ కూతురు అలయ ప్రేమలో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రేతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరు రహస్య ప్రేమలో మునిగి తేలుతున్నారని కథనాలు ప్రచురిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తమ మధ్య ఉన్నది వండర్‌ఫుల్ స్నేహం మాత్రమేనని స్పందించింది అలయ. ఐశ్వరీ ఒక అద్భుతమైన స్నేహితుడు అని అభివర్ణించింది.
ఐశ్వరీకి, తనకు మధ్య ఏదో ఉందంటూ వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోవద్దని సెలవిచ్చింది. మొదట్లో ఈ వార్తలు చూసి తన బంధుమిత్రులు ఆశ్చర్యపోయారని, కానీ రానురానూ వాళ్లకు కూడా అలవాటైపోయిందని చెప్పుకొచ్చింది. కాగా అలయ, ఐశ్వరీ.. ఇద్దరూ ఒకరి బర్త్‌డేకు మరొకరు హాజరవుతూ, కలిసి ఫొటోలకు పోజులివ్వడంతో వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఫిక్సయ్యారంతా. అయితే అలయ తల్లి పూజా కూడా ఈ గాసిప్‌ను ఖాతరు చేయలేదు. ఇలాంటి పుకార్లు చాలా చూశానని లైట్ తీసుకుంది. అయినా నటీమణులకు కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కుంది అంటూ తన కూతురి లైఫ్, తనిష్టమని స్పష్టం చేసింది.
చదవండి: ‘ఇది చాలా చిన్న విషయం, మరి ప్రజలు అంగీకరిస్తారో లేదో’
Comments
Please login to add a commentAdd a comment