అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు తప్పుగా అర్థం చేసుకునే రోజులివి. అలాంటిది ఇండస్ట్రీలోని నటీనటులు తరచూ కలిసి కనిపించారంటే చాలు సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కథనాలు అల్లేస్తారు ఈ క్రమంలో భాగ్యశ్రీ లిమాయే నటుడు భూషణ్ ప్రదాన్‌తో డేటింగ్‌లో ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై మండిపడింది భాగ్యశ్రీ.
'ఇదంతా తప్పుడు ప్రచారం. చాలాకాలం క్రితమే దీనిపై క్లారిటీ ఇచ్చాను కూడా! మరాఠీ ఇండస్ట్రీలో నాకు కొద్దిమంది మాత్రమే స్నేహితులున్నారు. అందులో కొందరు సెలబ్రిటీల ఫ్రెండ్స్‌తో కూడా నేను చిల్ అవుతుంటాను. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో యాక్టర్స్ కూడా ఉన్నారు. వారితోనే నేను అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాను. అందులో భూషణ్ ఒకరు. అతడితో కలిసి బయట కనిపించిన పాపానికి నాకు అతడికి ముడిపెడుతున్నారు. ఎందుకు మాకిద్దరికీ ముడిపెడతున్నారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వార్తలు విన్నప్పుడు మాత్రం మేము సీరియస్‌గా తీసుకోకుండా గట్టిగా నవ్వేస్తాం. అంతెందుకు, ఆ వార్తల క్లిప్పింగ్‌లు కూడా షేర్ చేసుకుంటాం' అని చెప్పుకొచ్చింది. తన జీవితంలో చాలామంది ప్రత్యేక వ్యక్తులు ఉన్నారన్న భాగ్యశ్రీ ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉందా? లేదా ప్రేమలో ఉందా? అన్న విషయాన్ని మాత్రం చెప్పనంది.
Comments
Please login to add a commentAdd a comment