బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది.
(ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు)
అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్‌కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోనూ రిలేషన్‌లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్‌పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి.
తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్‌లో ఉందన్న వార్త బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్‌పై శివాజీ ఎమోషనల్!)
కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment