
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడం.. అదంతా తూచ్ అని ఇద్దరూ కొట్టిపారేయడం.. చివరికి జంటగా కనిపించడం సదా మామూలే! మేమిద్దరం మంచి ఫ్రెంట్స్ అంటారు వాళ్లు.. కాదు కాదు, మీరు కచ్చితంగా ప్రేమికులే అంటారు అభిమానులు. రీల్ లైఫ్‌లోని గీతాగోవిందం రియల్ లైఫ్‌లో కూడా ఒక్కటైతే చూడాలని ఉందని తహతహలాడుతుంటారు. కానీ వాళ్లు మాత్రం ఎప్పుడూ ఓపెన్ అయింది లేదు.
అయితే తాజాగా రష్మిక.. విజయ్‌కు బ్రేక్ చెప్పిందని ఇప్పుడు మరో హీరోకు దగ్గరైందంటూ బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ మరో హీరో ఎవరో కాదు, మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాసే! వీరిద్దరూ రెండుమూడు సార్లు కలిసి కనిపించడం పాపం.. ప్రేమ మొదలైందంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏకంగా విజయ్‌కే బ్రేకప్ చెప్పిందని వార్తలు ప్రచారం చేస్తున్నారు. రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మధ్య తరచూ కలుస్తున్న విషయం వాస్తవమే కానీ వారిది కేవలం స్నేహం మాత్రమే! అంతకు మించి అంటే ఒప్పుకునేది లేదంటున్నారు అభిమానులు. అయినా సరే కొందరు నెటిజన్లు మాత్రం వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా రష్మిక చివరిసారిగా వారిసు చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో యానిమల్ మూవీ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే అతడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment