Sreenivas Bellamkonda Reacts On Rashmika Mandanna Dating Rumors, Here What He Say - Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: రష్మికతో లవ్‌ అంటూ రూమర్స్‌.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరో

May 3 2023 11:13 AM | Updated on May 3 2023 11:57 AM

Bellamkonda Sreenivas Breaks Silence on Dating Rumours with Rashmika Mandanna - Sakshi

బెల్లంకొండ కోసం విజయ్‌ దేవరకొండకు బ్రేకప్‌ చెప్పిందని వార్త అల్లేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ రూమర్లపై స్పందించాడు. మేమిద్దరం

ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌.  వీవీ వినాయక్‌​ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్‌ తరచూ ముంబై వెళ్లి వస్తున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో కొన్నిసార్లు ముంబై  ఎయిర్‌పోర్టులో రష్మికతో కలిసి కనిపించాడు. దీంట్లో అనుమానించడానికేం ఉంది, వాళ్లిద్దరూ ఫ్రెండ్స్‌ అని సౌత్‌ మీడియా లైట్‌ తీసుకుంది.

కానీ బాలీవుడ్‌ మాత్రం వాళ్లిద్దరి మధ్య ఇంకేదో ఉందని, బహుశా డేటింగ్‌ చేస్తున్నారేమోనని కథనాలు రాసేసింది. అంతేకాదు, బెల్లంకొండ కోసం విజయ్‌ దేవరకొండకు బ్రేకప్‌ చెప్పిందని వార్త అల్లేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ రూమర్లపై స్పందించాడు. 'మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది.. అలాంటిది మీరు ఏకంగా డేటింగ్‌ అనేస్తున్నారేంటి?

మేము ప్రేమలో ఉన్నామనేది పచ్చి అబద్ధం. మేము మంచి స్నేహితులం మాత్రమే! కాకపోతే మా వృత్తిరీత్యా మేము తరచూ హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లాల్సి వస్తోంది. అయినా కూడా కలిసి ఎప్పుడూ ప్రయాణించలేదు. కానీ అనుకోకుండా చాలా సార్లు ఎయిర్‌పోర్టులో ఒకరికొకరం తారసపడ్డాం. ఈ క్రమంలో బహుశా ఒకటీ, రెండుసార్లు మీడియాకు కనిపించామనుకుంటా! అంతే' అని చెప్పుకొచ్చాడు. దీంతో బెల్లంకొండ- రష్మిక డేటింగ్‌ అంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలకు చెక్‌ పడినట్లైంది.

చదవండి: బాక్సాఫీస్‌ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement