'ప్యార్ కా పంచ్‌నామా' సినిమా హీరోయిన్ సొనాలి సెగల్ లవ్‌లో ఉందట. కానీ బయటకు మాత్రం అబ్బే, తనింకా సింగిలే అని చెప్తోంది. బీటౌన్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సొనాలి ఆశేష్ ఎల్ సంజనాని అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందట. ఇతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు, ఎంటర్‌ప్రెన్యూర్. కాకపోతే అతడు ఇండస్ట్రీ సెలబ్రిటీలతో స్నేహం చేస్తుంటాడు.
ఇకపోతే వీరిద్దరి ప్రేమ ఇప్పటిది కాదని, నాలుగైదేళ్లుగా వీరి లవ్వాయణం నడుస్తోందని తెలుస్తోంది. కానీ ఈ విషయం బయటకు పొక్కకూడదనే వీరు బయటకు మీడియా కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో కూడా జంటగా దిగిన ఫోటోలను పంచుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం సోనాలి నూరాని చెహరె సినిమా చేస్తోంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ, నుపూర్ సనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల సత్యనారాయణ
కైకాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment