
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల అనంతరం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన చై భాషతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతున్నాడు. ఇటీవల లాల్ సింగ్ చడ్డాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై తాజాగా ‘కస్టడీ’తో కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది.
సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్‌కు సంబంధించి తరుచూ గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటి శోభిత దూళిపాళ్లతో చై డేటింగ్ రూమర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ నడిచింది. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చైతూకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
తాజాగా నాగ చైతన్య లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎందుకంటే ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ కూడా ఉండడంతో వైరల్‌గా మారింది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని పలుమార్లు గాసిప్స్ కూడా గుప్పుమన్నాయి. లండన్‌లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత ధూళిపాళ టేబుల్ దగ్గర కనిపించడం అభిమానుల్లో మరింత
అయితే గతేడాది నవంబర్‌లో లండన్ వెకేషన్‌కు వెళ్లిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కలిసి ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. గతంలో లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో ఈ విషయంపై చైతూను ప్రశ్నించగా నవ్వుతూ వెళ్లిపోయారు. కాగా.. ఇటీవలే హైదరాబాద్‌లోని కొత్తగా ఓ ఇంటికి షిఫ్ట్ అయ్యారు నాగ చైతన్య. అయితే వీరిద్దరిపై రిలేషన్‌పై ఎవరూ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment