సమంత- నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. తమ దారులు వేరంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే చై-సామ్‌లు ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు.
ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ డేట్‌కు వెళ్లడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత నాగచైతన్య డేటింగ్ రూమర్స్‌పై స్పందించినట్లు వార్తలు వచ్చాయి.
'ఎవరు ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి మిగిలేది కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తను ప్రవర్తన మార్చుకొని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది' అంటూ సామ్ పేర్కొన్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ మాటలు తాను అనలేదంటూ స్వయంగా సామ్ ట్వీట్ చేసింది. కాగా 2017లో ప్రేమపెళ్లి చేసుకున్న చై-సామ్‌లు 2021లో విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment