
Jaheer Iqbal Reacts To Dating Rumours With Sonakshi Sinha: గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై జహీర్ స్పందించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ పుకార్లను పట్టించుకోనని పేర్కొన్నాడు. 'ఇదంతా జరిగి చాలా కాలం అయింది. నేను అదంతా పట్టించుకోను. మీరు ఏది అనుకుంటే అది అనుకోండి. అలాగే ఆలోచించండి. అదే మీకు మంచిది అయితే అలాగే చేయండి. నేను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తుందా ? నన్ను క్షమించండి. దాని గురించి ఆలోచించడం మానేయండి.' అని జహీర్ తెలిపాడు.
ఇంకా ఈ విషయంపై జహీర్ మాట్లాడుతూ 'ఇదంతా సినీ పరిశ్రమలో ఒక భాగం. నేను పరిశ్రమకు రాకముందే తను తెలుసు. ఈ పరిశ్రమలో నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఇలా జరిగినప్పుడు ఎక్కువగా రాస్తారు, దానిపై పెద్దగ శ్రద్ధ పెట్టవద్దని సల్మాన్ ఖాన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కాబట్టి నేను నిజంగా ఈ విషయాన్ని పట్టించుకోను.' అనిపేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2010లో 'దబాంగ్' సినిమాతో సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేయగా జహీర్ ఇక్బాల్ 'నోట్‌బుక్' మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు.
ఇది చదవండి: ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ..
Comments
Please login to add a commentAdd a comment