
బాలీవుడ్ నటులు తారా సుతరియా, అధర్ జైన్ ప్రేమలో ఉన్నట్లు బీ టౌన్‌లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫొటోతో వీరిద్దరు ప్రేమలో ఉన్నది నిజమేనని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ‘యూ2 ముంబై’ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొన్న అధర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. దానికి ‘నేను మీతో ఉన్నప్పుడు’ అని కామెంట్ పెట్టి తారా సుతరియాను ట్యాగ్ చేశాడు. దీనికి స్పందించిన సుతరియా అదే ఫోటోపై ‘ఎల్లప్పుడూ మీతో.. లవ్ ఎమోజీ’ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో..‘నటుడు అధర్ జైన్‌తో మీరు డేటింగ్ చేస్తున్నారా’ అని యాంకర్ ప్రశ్నించగా.. సుతరియా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. అలా అని తిరస్కరించలేదు. కానీ.. ‘మేము ఒకరికొకరు తోడుగా.. ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. అధర్ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మేము బయటికి వెళ్లిన సమయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాం. నేను అతను ఆహార ప్రియులం’అని తారా సుతారియా సమాధానం ఇచ్చారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2లో నటించిన సుతరియా మంచి నటన కనబర్చింది. సుతరియా, అధర్ నటించిన ‘మర్జావాన్’ చిత్రం ఇటీవల విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment