
బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్‌లో ఉన్నారా? దీనిపై ప్రస్తుతం బీటౌన్‌లో చర్చ నడుస్తోంది. ముంబయికి చెందిన గ్రాఫిక్ డిజైనర్‌తో నాలుగేళ్లుగా డేటింగ్ కొనసాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. గ్రాఫిక్ డిజైనర్ రాధికా కోల్గాంకర్‌తో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి.
కాగా.. ఆదర్శ్ గౌరవ్ 'ది వైట్ టైగర్'లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. అయితే ఆదర్శ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడడని తెలుస్తోంది. అయితే డేటింగ్ వార్తలను ఆదర్శ్ ఖండించలేదు. రాధికా కోల్గాంకర్‌తో రిలేషన్‌పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను తన రాబోయే ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించినందువల్లే ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడటం లేదని తెలుస్తోంది. సినిమాల విషయాకొనిస్తే గౌరవ్ 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్‌తో తన నటనను ప్రారంభించాడు. రామిన్ బహ్రానీ దర్శకత్వంలో బలరామ్ హల్వాయి పాత్రను పోషించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించిన 'ఖో గయే హమ్ కహాన్'లో నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment