graphic designer
-
గ్రాఫిక్ డిజైనర్‌తో హీరో డేటింగ్.. నాలుగేళ్లుగా!
బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్లో ఉన్నారా? దీనిపై ప్రస్తుతం బీటౌన్‌లో చర్చ నడుస్తోంది. ముంబయికి చెందిన గ్రాఫిక్ డిజైనర్‌తో నాలుగేళ్లుగా డేటింగ్ కొనసాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. గ్రాఫిక్ డిజైనర్ రాధికా కోల్గాంకర్తో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. కాగా.. ఆదర్శ్ గౌరవ్ 'ది వైట్ టైగర్'లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. అయితే ఆదర్శ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడడని తెలుస్తోంది. అయితే డేటింగ్ వార్తలను ఆదర్శ్ ఖండించలేదు. రాధికా కోల్గాంకర్తో రిలేషన్‌పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను తన రాబోయే ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించినందువల్లే ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడటం లేదని తెలుస్తోంది. సినిమాల విషయాకొనిస్తే గౌరవ్ 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్‌తో తన నటనను ప్రారంభించాడు. రామిన్ బహ్రానీ దర్శకత్వంలో బలరామ్ హల్వాయి పాత్రను పోషించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించిన 'ఖో గయే హమ్ కహాన్'లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Adarsh Gourav (@gouravadarsh) -
1,00,000 గ్రాఫిక్ డిజైనర్లు
సాక్షి, అమరావతి : ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లోకి పలు సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యక్తిగత ప్రచారానికి, వైరి పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా గ్రాఫిక్స్‌తో ఫోటోలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష మందికిపైగా గ్రాఫిక్ డిజైనర్లు పనిచేస్తున్నట్టు సమాచారం. దాదాపు 1.60 కోట్ల మంది ఎలక్షన్ ట్రెండ్‌ను సోషల్ మీడియా ద్వారా అనుసరిస్తున్నారు. వీరి ద్వారా సమాచారం మరో 1.20 లక్షల మందికి చేరుతోంది. వీరికి ఫేస్బుక్, ట్విట్టర్లకు 1.10 కోట్ల మంది, వాట్సాప్ గ్రూపుల్లో 50 లక్షల మంది లింక్ అయినట్టు తెలుస్తోంది. గ్రూపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి కచ్చితంగా అంచనా వేయలేమని సర్వే సంస్థ పేర్కొంది. విషయాలను తెలుసుకునేందుకు ప్రధానంగా ఫేస్‌బుక్‌కు కనెక్ట్ అవుతున్నారు. ప్రధాన పార్టీలు, నేతల మనోగతాన్ని తెలుసుకునేందుకు ట్విట్టర్ అకౌంటును క్లిక్ చేస్తున్నారు. -
ఔను...అచ్చం అలాగే!
కాపీ కళలో కాకలు తీరిన ఆర్టిస్ట్ మైక్ రోమ్. అరవై ఆరు సంవత్సరాల మైక్, బ్రిస్టల్(ఇంగ్లండ్)లోని తన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో మోనాలిసాలాంటి మాస్టర్పీస్లను వేగంగా గీస్తుంటాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వందలాది కళాఖండాలను ఒంటిచేత్తో గీశాడు మిస్టర్ రోమ్. ఈయన ఒకప్పుడు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశాడు.తన భార్య పామ్ చనిపోయిన తరువాత రోమ్ను ఒంటరితనం ఆవహించింది. దాని నుంచి బయటపడడానికి తనను తాను ఎప్పుడు బిజీగా ఉంచుకోవడానికి ఈ కళ తనకు ఉపయోగపడింది. చిత్రకళలో ఎవరి దగ్గరా ఎలాంటి శిక్షణా తీసుకోని రోమ్ ‘సాధనను మించిన అనుభవం లేదు’ అని నమ్ముతాడు. రోమ్‌లోని ప్రతిభ మొదటిసారి కొందరు ఇంజనీర్ల దృష్టిలో పడింది. అప్పుడు ఆయన వారి ఆఫీస్‌లో పనిచేసేవాడు.రోమ్ను చిత్రాలు వేయించే దిశగా ఆ ఇంజనీర్లు ఎంతగానో ప్రోత్సహించారు.తాను ఒక చిత్రాన్ని చిత్రించే ముందు దాని తాలూకు ఒరిజినల్‌ను గ్యాలరీకి వెళ్లి చూసి వస్తాడు. ఆ తరువాతగానీ కుంచెకు పనిచెప్పడు రోమ్. ‘‘నేను గీసేవి నకిలీ అనుకోనక్కర్లేదు. వాటికంటూ ఒక సొంత విలువ ఉంది’’ అంటాడు రోమ్. ఒక్కో పెయింటింగ్ వేయడానికి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి తీసుకుంటాడు. రోమ్ కాపీ చేసిన చిత్రాలు ఎన్నో గ్యాలరీలలో కొలువవుతుంటాయి. మంచి ధరకు అమ్ముడవుతుంటాయి. ‘‘చిత్రకళలలో నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికే మొదట ఈ పని మొదలు పెట్టాను’’ అంటున్న రోమ్ ఆ తరువాత ‘రెప్లికా’ ను ప్రధాన వృత్తిగా చేసుకున్నాడు. ప్రసిద్ధ చిత్రాలను మాత్రమే కాపీ చేయాలనే నియమమేదీ పెట్టుకోలేదు. తన మనసుకు నచ్చిన అనామక చిత్రాలను కూడా కాపీ చేస్తుంటాడు.‘‘కాపీ కళ అనగానే కొంత చిన్నచూపు ఉంటుంది. గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది’’ అంటాడు రోమ్. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ చిత్రాలను అమ్మగలనంటున్నాడు మైక్ రోమ్.