
'మేజర్' హీరోయిన్ సాయి మంజ్రేకర్ లవ్‌లో పడిందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో డేటింగ్ చేస్తుందంటూ కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై స్పందించిన హీరోయిన్ అవన్నీ అసత్య ప్రచారాలుగా కొట్టిపారేసింది.
తామిద్దరం చిన్ననాటినుంచే బెస్ట్‌ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. నిజానికి దీనిపై ఎలా స్పందించాలో కూడా తనకు అర్థం కావడం లేదన్న ఆమె తనతో డేటింగ్ అంటూ వస్తున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. చిన్నప్పటి నుంచే తనమీద పుకార్లు పుట్టించడం కామన్ అయిపోయిందన్న సాయి మంజ్రేకర్ తనేంటో తన కుటుంబానికి, స్నేహితులకు తెలుసని చెప్తోంది.
Comments
Please login to add a commentAdd a comment