ఆ వార్తలు నా మనసును తీవ్రంగా బాధపెట్టాయి: సబా | Hrithik Roshan Girlfriend Saba Azad Reacts On Dating Rumours | Sakshi
Sakshi News home page

Hrithik Roshan-Saba Azad: హృతిక్‌తో డేటింగ్ రూమర్స్.. ఆ విషయం చెప్పాలనుకున్నా: సబా

Oct 2 2023 9:09 PM | Updated on Oct 3 2023 10:24 AM

Hrithik Roshan Girl Friend Saba Azad Reacts On Dating Rumours - Sakshi

బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ రోషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనితో నటి సబా ఆజాద్‌ రిలేషన్‌లో ఉందంటూ చాలా సార్లు బీటౌన్‌లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు జంటగా పలు ఈవెంట్లకు హాజరు కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా.. సబా ఆజాద్ ప్రస్తుతం హూ ఈజ్ యువర్ గైనెక్? అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సబా ఆజాద్ తనపై వస్తున్న రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. తమ రిలేషన్‌షిప్‌ గురించి చాలామంది ట్రోల్స్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. వాటితో తాను చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది.

(ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!)

సబా ఆజాద్ మాట్లాడుతూ.. 'ఇతరుల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేనేం రాయిని కాదు కదా. వారు చేసే కామెంట్స్ నా మనసును బాధపెట్టాయి. ఆ ట్రోలింగ్స్‌ చూసి నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా జీవితం నా ఇష్టం కదా. మీరు కూడా మీ లైఫ్‌ను మీకు ఇష్టమొచ్చినట్లు జీవించండి అని చెప్పాలనుకున్నా.' అని అన్నారు. అయితే కొన్ని రోజులకు ఇలాంటి మాటలను పట్టించుకోకూడదని పూర్తిగా అర్థమైంది. అప్పటి నుంచి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేసి మనశ్శాంతితో జీవిస్తున్నట్లు తెలిపారు.

హృతిక్‌ రోషన్‌, నటి సబా ఆజాద్‌ రిలేషన్‌లో ఉన్నట్లు అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తన ప్రేమ చూపిస్తూ వచ్చారు. వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్ద వ్యక్తితో ప్రేమలో ఉండటంపై సబాను పలువురు ట్రోల్‌ చేశారు. విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమాయణం ఏంటి? అని ప్రశ్నించారు.

కాగా.. హృతిక్ డిసెంబర్ 20, 2000లో సుస్సానే ఖాన్‌ను వివాహం చేసుకున్నారు.  ఈ జంట నవంబర్ 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు హ్రేహాన్, హృదాన్ ఉన్నారు. దీంతో హృతిక్, సబా జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం హృతిక్ ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కనిపించనున్నారు. 

(ఇది చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement