నేను ఆయనతో డేటింగ్ చేయడం లేదు! | Kriti Sanon rubbishes rumours of dating Sushant | Sakshi
Sakshi News home page

నేను ఆయనతో డేటింగ్ చేయడం లేదు!

Published Thu, Jul 21 2016 3:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

నేను ఆయనతో డేటింగ్ చేయడం లేదు!

నేను ఆయనతో డేటింగ్ చేయడం లేదు!

ముంబై: ‘‘వన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది బాలీవుడ్ భామ కృతి సనన్. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నాగాచైతన్యతో కలిసి ‘దోచేయ్’ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనస్సు దోచేయడంలో విఫలమవ్వడంతో ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలకు పరిమితమైన ఈ భామ చుట్టూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ‘రబ్తా’ సినిమాలో నటిస్తున్న కృతి.. ఆ సినిమాలో తన సహ నటుడైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

అయితే, ఈ కథనాలను కృతి తోసిపుచ్చింది. తాను సుశాంత్‌ను ఏమాత్రం కలుసుకోవడం లేదని, ఇంతకంటే వివరణ ఇవ్వడానికి ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది. సుశాంత్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వెలువడుతున్న కథనాలను ట్విట్టర్‌లోనూ కృతి ఖండించింది. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది.

‘మాదారి’ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడింది. డేటింగ్ వార్తలపై స్పందించకుండా ఉండటమే మేలు అని తాను మొదట అనుకున్నానని, కానీ చిలువలు పలువలుగా కథనాలు వండి వారుస్తుండటంతో వాటిని ఖండిస్తూ తాను ట్విట్టర్‌లో వివరణ ఇచ్చానని, అంతకుమించి చెప్పాల్సిందేమీ లేదని ఆమె స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement