
ఇటీవల బాలీవుడ్ భామ అనన్య పాండే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. ఎందుకంటే గత నెలలో ఈ జంట ఇటీవల పోర్చుగల్ ట్రిప్‌కు వెళ్లగా.. అక్కడ వీధులు, రెస్టారెంట్లలో జంటగా దిగిన ఫోటోలు కాస్తా నెట్టింట దర్శనమివ్వడంతో డేటింగ్ గాసిప్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి చంకీ పాండే ఈ వార్తలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కూతురి రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
(ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?)
చంకీ పాండే మాట్లాడుతూ..' నటీనటుల జీవితంలో రిలేషన్స్‌పై రూమర్స్ రావడమనేది సాధారణమైన విషయం. మేము గ్లామర్‌లో వృత్తిలో ఉన్నాం. ఇలాంటివన్నీ జరగాల్సినవే. కెరీర్‌కు ఇది నష్టం కలిగించినప్పటికీ.. వీటిని మనం కట్టడి చేయలేం. అనన్య చాలామంది హీరోలతో అద్భుతంగా నటించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో టైగర్ ష్రాఫ్ సరసన, 'పతి, పత్నీ ఔర్ వో'లోని కార్తీక్ ఆర్యన్‌తో సినిమాలు చేసింది. ఆమెకు ఇది ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ విషయంలో నాకు ఎవరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తనకి నేను చెప్పేది ఒక్కటే.. నా కంటే మెరుగ్గా ఉండాలి.' అని అన్నారు.
కాగా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. విజయ్ దేవరకొండతో 'లైగర్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఆయుష్మాన్ ఖురానాతో 'డ్రీమ్ గర్ల్' సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీలో నటించనుంది. ఆదిత్య రాయ్ కపూర్'ది నైట్ మేనేజర్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇది చదవండి: 83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!)
Comments
Please login to add a commentAdd a comment