
టైగర్ ష్రాఫ్, దిశాపాట్నీ
బాలీవుడ్ యంగ్ యాక్టర్స్ టైగర్ ష్రాఫ్, దిశా పాట్నీ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా టాక్. హాలీడేలు, డిన్నర్‌లు, పార్టీలు అంటూ తిరుగుతూ ఆ వార్తను మరింత బలోపేతం చేస్తోంది ఈ జంట. ఇలా బయట కనిపిస్తూ ఉన్నా కూడా తమ మధ్య ఉన్న అనుబంధం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఈ ఇద్దరూ. కానీ రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్‌లో టైగర్ ష్రాఫ్‌ను.. దిశా పాట్నీకు, మీకు రిలేషన్‌షిప్ ఏంటి? అని అడగ్గా ‘మేం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ’ అని సమాధానం ఇచ్చాడు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘దిశా, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు దానికంటే ఎక్కువ. దిశా చాలా ఇన్‌స్పైరింగ్, హార్డ్ వర్కింగ్ అమ్మాయి. సక్సెస్‌ని, టాలెంట్‌ని తలకెక్కించుకోని గుణం ఆమెది. ఫస్ట్‌లో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది’’ అంటు దిశాపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఇంతకీ వాళ్ల ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమా? కేవలం స్నేహమేనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టైగర్.
Comments
Please login to add a commentAdd a comment