ఆ హీరోయిన్ నా గర్ల్‌ఫ్రెండ్ కాదు! | Kriti Sanon is not my girlfriend, says sushant singh rajput | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ నా గర్ల్‌ఫ్రెండ్ కాదు!

Published Mon, May 22 2017 7:17 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

ఆ హీరోయిన్ నా గర్ల్‌ఫ్రెండ్ కాదు!

ఆ హీరోయిన్ నా గర్ల్‌ఫ్రెండ్ కాదు!

వాళ్లిద్దరూ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటే ఇద్దరి మధ్య ఏదో ఉందనే అందరూ అనుకున్నారు. కానీ రాబ్తా సినిమాకు సైన్ చేయగానే అంతా మారిపోయింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కవుట్ అవుతోందో అందరికీ అర్థమైంది. ధోనీ సినిమాతో ఒక్కసారిగా తారాపథాన్ని అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కృతి సనన్‌లను చూసి వాళ్లిద్దరి బంధం దృఢమైనది అనే అందరూ అనుకున్నారు. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు వెంటనే పుట్టుకొచ్చేశాయి. రాబ్తా షూటింగ్ సమయంలో ఇది మొదలైంది. అప్పటినుంచి తెగ చక్కర్లు కొడుతోంది. సరిగ్గా అదే సమయానికి సుశాంత్ తన ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్ అంకితా లోఖండేతో బ్రేకప్ కావడంతో కృతితో జంట కుదిరినట్లేనని అంతా భావించారు.

కానీ.. ఇప్పుడు మాత్రం అదేమీ లేదని సుశాంత్ కొట్టిపారేస్తున్నాడు. తామిద్దరం కేవలం 'మంచి స్నేహితులు' మాత్రమేనని, అంతకంటే మరేమీ లేదని చెబుతున్నాడు. ''మేమా.. లవ్‌బర్డ్సా.. నాకు తెలియజేసినందుకు థ్యాంక్స్'' అంటూ నవ్వేశాడు. అయితే బుడాపెస్ట్‌లో రాబ్తా సినిమా షూటింగ్ సమయంలో బయటకు వచ్చిన వాళ్లిద్దరి ఫొటోలు చూస్తే మాత్రం అది కేవలం స్నేహం మాత్రమే కాదని అంతా అన్నారు. అంతకుముందు అంకితతో బ్రేకప్ అయినప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటును డిలిట్ చేసిన సుశాంత్, ఆ తర్వాత కృతి సనన్‌తో కలిసి తీయించుకున్న ఫొటోతో మళ్లీ అందులోకి వచ్చాడు. దాంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. షాట్ గ్యాప్‌లో కూడా ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారని వదంతులు పుట్టుకొచ్చాయి.  

కృతికి కోపం వచ్చింది..
తామిద్దరి గురించి ఇలా మీడియాలోను, సోషల్ మీడియాలోను తెగ ప్రచారం జరగడంతో కృతి సనన్‌కు కూడా కోపం వచ్చింది. ఇప్పటివరకు చెప్పింది చాలని, తామిద్దరికీ సహ నటులుగా ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని అంతే తప్ప అందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదని, అవన్నీ నిరాధార వదంతులేనని కృతి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement