దారి దోపిడీకి గురైన కడప జిల్లా వ్యాపారి | kadapa person lost his money by robbery | Sakshi
Sakshi News home page

దారి దోపిడీకి గురైన కడప జిల్లా వ్యాపారి

Sep 3 2017 1:26 PM | Updated on Aug 30 2018 5:27 PM

కారులో ప్రయాణికుల మాదిరి ఉన్న నలుగురు వ్యక్తులు ఓ వ్యాపారిని దోచుకున్న వైనమిది.

సాక్షి, శంషాబాద్‌: కారులో ప్రయాణికుల మాదిరి ఉన్న నలుగురు వ్యక్తులు ఓ వ్యాపారిని దోచుకున్న వైనమిది. ఈ సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుoది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెoదిన షావలి(19) ఉల్లిగడ్డ వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఉల్లిగడ్డ అమ్మకుని వచ్చిన డబ్బులతో ప్రొద్దుటూరు తిరిగి వెళ్లే ప్రయత్నంలో శుక్రవారం రాత్రి ఆరాంఘర్‌ వద్ద నిలబడ్డాడు.

కడప వైపు వెళ్తున్నానంటూ ఓ కారు డ్రైవర్ చెప్పడంతో ఎక్కాడు. అయితే అప్పటికే మరో నలుగురు వ్యక్తులు అందులో ఉన్నారు. కారు శంషాబాద్ మండలం​గండిగుడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చేసరికి రోడ్డుపక్కకు కారు ఆగింది. అందులోని వారంతా చావలి వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని అడగ్గా షావలి నిరాకరించడంతో కొట్టి రూ.40వేల నగదు, సెల్‌ఫోన్‌ లాక్కుని అతడిని అక్కడే రోడ్డుపై వదిలి కారులో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement