
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ..ఇలా ఆర్థిక నేరాలకు పాల్పడి విచారణను తప్పించుకునేందుకు 31 మంది వ్యాపారవేత్తలు విదేశాలకు పారిపోయారని ప్రభుత్వం గురువారం లోక్‌సభలో వెల్లడించింది. ఈడీ, సీబీఐలు విచారణ చేపట్టిన పీఎన్‌బీ స్కాం నిందితులు నీరవ్, మెహుల్ చోక్సి సహా ఆర్థిక నేరాలకు పాల్పడిన 31 మంది విదేశాల్లో తలదాచుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ జాబితాలో నీరవ్ మోదీ, ఆయన భార్య అమీ, కుమారుడు నిషాల్, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, లలిత్ మోదీ, ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ తదితరులున్నారు.
విజయ్ మాల్యా, అశిష్ జబన్‌పుత్ర, పుశ్పేష్ కుమార్ వైద్, సంజయ్ కల్రా, వర్షా కల్రా, ఆర్తి కల్రాల అప్పగింతపై సీబీఐ నుంచి మంత్రిత్వ శాఖకు వినతులున్నాయని మంత్రి చెప్పారు. నిందితుల బదలాయింపులపై సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కాగా ప్రభుత్వం వెల్లడించిన జాబితాలో ఇంకా సౌమిత్ జెనా, విజయ్‌కుమార్ రెవాభాయ్ పటేల్, సునీల్ రమేష్ రూపాని, సురేందర్ సింగ్, ఆనంద్ సింగ్, హర్‌సాహిబ్ సింగ్, హర్లీన్ కౌర్, జతిన్ మెహతా, చేతన్ జయంతిలాల్ సందేశర, దీప్తి చేతన్, నితిన్ జయంతిలాల్, సవ్యసేథ్, నీలేష్ పరేఖ్, ఉమేష్ పరేఖ్, హేమంత్ గాంధీ, ఈశ్వర్‌భాయ్ భట్, ఎంజీ చంద్రశేఖర్, చెరియా వనరక్కల్ సుధీర్, నౌషా కదీజత్, చెరియా విటీల్ సాధిక్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment