ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్ - ఫైట్‌కి ముందే సర్జరీ అవసరం అంటూ.. | Elon Musk tweet Viral check the details | Sakshi
Sakshi News home page

Elon Musk: ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్ - ఫైట్‌కి ముందే సర్జరీ అవసరం అంటూ..

Aug 7 2023 4:11 PM | Updated on Aug 7 2023 4:16 PM

Elon Musk tweet Viral check the details - Sakshi

Elon Musk Tweet: ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్‌బర్గ్‌ మధ్య కేజ్ ఫైట్ జరగనున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇంతలో మస్క్ చేసిన ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా.. నేను రేపు నా మెడ, అప్పర్ బ్యాక్ ఎమ్ఆర్ఐ చేయించుకుంటున్నాను, బహుశా సర్జరీ అవసరం కావొచ్చు అంటూ ట్వీట్ చేసాడు. ఖచ్చితమైన డేట్ ఈ వారంలో తెలుస్తుందన్నాడు.

ఇప్పటికే ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతే కాకుండా ఈ పోరాటానికి తానూ పూర్తిగా సిద్దమవుతున్నట్లు, అయితే వర్కవుట్‌ చేసే సమయం లేదని అందుకే వర్క్‌ దగ్గరకే వెయిట్స్‌ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో మస్క్ జుకర్‌బర్గ్‌తో "కేజ్ ఫైట్ కోసం సిద్ధంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు, దానికి "నాకు లొకేషన్ పంపండి" అని బదులిచ్చాడు. కాగా జుకర్‌బర్గ్‌ తాజాగా బ్రెజిలియన్‌ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్‌ సాధించినట్లు తెలిపాడు. ఇక వీరి కేజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement