దేశంలోని అతిపెద్ద పైపుల బ్రాండ్‌కు బిలియనీర్ యజమాని, సందీప్ ఇంజనీర్ బిలియనీర్‌గా అవతరించడం వెనుక చాలా కష్టాలున్నాయి. జీవితంలో చాలా హెచ్చుతగ్గులు చవి చూశారు. కానీ విజయవంతమైన పారిశ్రామికవేత్త కావాలనే అతని సంకల్పం ముందు అన్నీ ఓడిపోయాయి. 2019లో ఆస్ట్రల్ పైప్స్ వ్యవస్థాపకుడిగా సందీప్ ఇంజనీర్ గౌరవనీయమైన బిలియనీర్స్ క్లబ్‌లోకిఎంట్రీ ఇచ్చారు. మామూలు ఫార్మ ఉద్యోగి నుంచి 21 వేల కోట్ల రూపాయల కంపెనీకి యజమానిగా సందీప్ సక్సెస్‌ఫుల్ జర్నీ..!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని కాడిలా ల్యాబ్స్‌లో పనిచేసేవారు సందీప్. 20 ఏళ్ల వయసులో 1980లలో వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.. ఆ సమయంలో అతనికి వ్యాపారం చేయడంలో అనుభవంలేదు కుటుంబ నేపథ్యమూ లేదు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేశారు. ఇసాబ్గోల్ అనే తొలి వెంచర్‌ను స్టార్ట్ చేశారు. కానీ అక్కడ విజయం సాధించలేకపోయారు. వ్యాపారంలో విఫలమయ్యారు. ఒక దశలో చేతిలో చిల్లిగవ్వలేదు.
ఈ క్రమంలో పంకజ్ పటేల్ అనే బిలియనీర్ వ్యాపారవేత్త సందీప్‌కు మార్గదర్శకత్వం వహించడంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది పంకజ్‌పటేల్ మద్దతుతో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల (API) వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇక్కడ లాభనష్టాలతో పోరాటం తప్పలేదు. తమ ఉత్పత్తులు నిరుపయోగంగా మారడంతో వాటిని మార్చాల్సి వచ్చింది. కానీ ఆ తరువాత ఇంజనీర్ క్లోరినేటెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ (సీపీవీసీ) పైపుల వ్యాపారంలో జాక్‌పాట్ కొట్టారు.
ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ
అమెరికా నుంచి వచ్చిన కొత్త ఆవిష్కరణ 1998లో సందీప్ ఇంజనీర్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ అనే కొత్త వ్యాపారానాకి నాంది పలికింది. మొదట్లో దీన్ని చాలామంది విశ్వసించ నప్పటికీ, క్రమం బలం పుంజుకుంది. 2000ల ప్రారంభంలో సందీప్ ప్లంబింగ్ పైపుల తయారీ సంస్థగా బ్రాండ్‌ను స్థాపించారు. ఆ తరువాత 2010ప్రారంభంలో కుమారులు కైరవ్, సౌమ్య అందిరావడంతో సందీప్‌కు మరింత కలిసి వచ్చింది. 2003లో రూ 15 కోట్ల ఆదాయం ఒక్క ఏడాదిలోనే 25 కోట్లకు పెరిగింది. 2007లో, 60కోట్ల వాల్యూతో ఆస్ట్రాల్‌కు ఐపీఓవకు వచ్చింది. దీని ద్వారా రూ. 35 కోట్లను సేకరించింది. 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆస్ట్రల్ స్పాన్సర్‌గా ఉంది. (సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్)
దబాంగ్ సిరీస్, బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్
వీటన్నింటికి మించి 2014లో ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో రెండేళ్ల ఒప్పందం కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసింది. అంతకుమందు సల్మాన్ నటించిన 'దబాంగ్-2' చిత్రంతో భాగస్వామ్యం సక్సెస్ కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)
కాగా 2023, ఏప్రిల్ నాటికి సందీప్ నెట్‌వర్త్ 21 వేల కోట్ల రూపాయలు. అసలు బిలియనీర్ కావాలనేది తన కోరిక కాదు. ఇదంతా శరవేగంగా జరిపోయిందని గతంలో ఫోర్బ్స్‌తో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సందీప్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ రిటైల్, రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్స్, ఇతర పరిశ్రమలోని అన్ని రంగాలలో బలమైన క్లయింట్ బేస్ ఉంది. ఆస్ట్రల్‌కు అమెరికా, యూకే, కెన్యాలో సహా పలు ప్రదేశాల్లో ఫ్యాక్టరీలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment