boost
-
మొక్కలు సరిగా ఎదగడం లేదా? ఈ టిప్స్ ట్రై చేయండి!
ఇంటి కుండీలలో లేదా పెరటి తోటల్లో పెంచే మొక్కలు ఒక్కొక్కసారి ఎండి పోతుంటాయి. ఎండిన చెట్టు చిగురించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అసలు చెట్లు ఎందుకు ఎండిపోవడానికి నీరు లేక, మరే ఇతర కారణమా అనేది గుర్తించాలి. నీరు తక్కువైనప్పుడే కాదు.. నీరు ఎక్కువగా ఉన్నా చెట్లు ఎండిపోతుంటాయి. కాబట్టి, అలా లేకుండా చూడండి. త్వరలో వసంత రుతువు రాబోతోంది. మీ పెరటి తోటలో లేదా ఇంటి కుండీలలో ఉన్న చెట్లను సంరక్షించుకోవడం ఇప్పటినుంచే ఆరంభిస్తేనే కదా అప్పటికి చక్కగా చిగిర్చి పూలు పూసేది! ఇంకెందుకాలస్యం? చూసేద్దామా మరి! మొక్కలకు జీవకళ మొక్కలు సాధారణంగా పురుగుల కారణంగా అనేక తెగుళ్ళ బారిన పడుతుంటాయి. అప్పుడు ఎండి, వాడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. ఆకులపై దుమ్ము, ధూళి పేరుకుపోయినా అవి కళ తప్పుతాయి. అందువల్ల వాటిని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇందుకు చిన్న పాటి పైపు లేదా స్ప్రేయర్ ఉపయోగపడుతుంది. సూర్యకాంతి... చెట్లకి సరైన కాంతి అవసరం. అలాగని మరీ ఎండలో కూడా ఉంచరాదు. లేదా బాగా చీకటి ఉన్న ప్రదేశంలో ఉంచడమూ సరికాదు. ఎండ పొడ పడే ప్రదేశంలోనే కుండీలని ఉంచాలి లేదా చెట్లని పెంచాలి. కుండీల పరిమాణం... కుండీలో పెంచే మొక్క తీరును బట్టే కుండీని ఎంచుకోవాలి. చెట్ల కుండీలు అవి పెరగడానికి సరిపడనంత లేకుండా చిన్నగా ఉన్నా చెట్లు ఎండిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి, సరైన పరిమాణంలో ఉన్న కుండీల్లో పెంచడం మేలు. మొక్కలని శుభ్రం చేయడం... దెబ్బతిన్న, ఎండిన, పండిన ఆకులని ఎప్పటికప్పుడు తుంచి శుభ్రం చేయాలి. వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది. తెగులు సోకిన కొమ్మలను, ఆకులని తుంచడం వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎరువులు... ఎరువు లేకుండా పెంచడం వల్ల చెట్లు నిస్తేజంగా... సారం లేనట్లు... వడలిపోయినట్లు కనిపిస్తాయి. అందువల్ల వాటికి అప్పుడప్పుడు ఎరువులు వేయాలి. అప్పుడే మొక్కలు చక్కగా పెరుగుతాయి. వీలయినంత వరకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడటం మంచిది. బియ్యం, పప్పులు కడిగిన నీళ్లని పోయడం, ఉల్లిపొట్టు, కూరగాయల తొక్కలు వంటి వంటింటి వ్యర్థాలతో ఎరువులు తయారు చేసే ఉపకరణాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి సాయం తో తయారు చేసిన ఎరువులు వాడటం వల్ల వాటికే కాదు, అవి తినే మన ఆరోగ్యానికి కూడా మంచిది. -
Silent walking: మనతో మనం మాత్రమే
మార్నింగ్ వాక్కు గుంపుగా బయలుదేరుతారు కొందరు. తోడు లేనిదే కదలరు కొందరు. ఒంటరిగా బయలుదేరితే పాటలు వింటూ నడుస్తారు కొందరు. లేదా ఫోన్లు మాట్లాడుతూ ఉభయతారకంగా నడుస్తారు ఇక మనతో మనం ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ‘సైలెంట్ వాకింగ్’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఫోన్లు, సాటి మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మనతో మనం ఉంటూ నడవడం. దీనివల్ల మానసికంగా, భౌతికంగా ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ టీచర్ విశ్వనాథం. ఆయన తన అపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు నలుగురితో కలిసి ఉదయాన్నే వాకింగ్‌కు వెళతారు. ఫోన్ తీసుకువెళతారు. ఆ ముగ్గురు నలుగురు కలవగానే ఇక కబుర్లు మొదలు. నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా ఎంతలేదన్నా రాజకీయాలు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు చర్చకు వస్తాయి. ఏవో పాత గొడవలు గుర్తుకు వస్తాయి. చిన్నపాటి వాదనలు జరుగుతాయి. ఈలోపు మెసేజ్‌లు, ఫేస్బుక్ చెకింగు, ఒక ఫోన్ కాల్ ఎవరిదో మాట్లాడటం... ఉదయాన్నే మనసు, శరీరం తేలిక కావాల్సింది పోయి బరువైపోతాయి. ఐ.టి. ఫీల్డ్‌లో పని చేసే అవివాహిత చందన సాయంత్రం ఇల్లు చేరుకుని వాకింగ్‌కు బయలుదేరుతుంది. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ నడుస్తుంటుంది. ఆ పాటల్లో పూర్తిగా లీనం కాకుండా మెసేజ్‌లు, కాల్సూ వస్తూనే ఉంటాయి. పాటలు కూడా విన్నవే వినడం వల్ల కొత్త అనుభూతి కలగదు. పాటలు వినాలి కాబట్టి వింటున్నానా అనే సందేహం వస్తుంది. గృహిణి సుభాషిణి సాయంత్రం వీలు చూసుకుని ఎలాగో వాకింగ్‌కు బయలుదేరుతుంది. కాని ఆమె వాకింగ్‌కు బయలుదేరిన వెంటనే ఊళ్లో ఉన్న తల్లికి ఫోన్ చేయాలి. అది తల్లి ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్. కూతురితో మాట్లాడకపోతే ఆమెకు తోచదు. సుభాషిణి వాకింగ్ మొదలెట్టి తల్లికి కాల్ చేయగానే తల్లి ఏవేవో విషయాలు ఏకరువు పెడుతుంది. కొన్ని ఫిర్యాదులు, కొడుకు మీద అభ్యంతరాలు, ఇంకేవో ఇరుగు పొరుగు గాసిప్... ఎంత లేదన్నా అలజడి కలిగిస్తాయి. ఇదా వాకింగ్ అంటే. ► సైలెంట్ వాకింగ్ విరుగుడు టిక్‌టాక్ ఇన్ఫ్లూయెన్సర్ మాడీ మాయో మొన్నటి సెప్టెంబర్‌లో ఈ ‘సైలెంట్ వాకింగ్’ను ప్రతిపాదించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా అన్ని లంపటాలను వదిలి ఎవరితోనూ వాగుడు పెట్టుకోకుండా హాయిగా మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం చాలా బాగుంది అని ఆమె పెట్టిన ఒక పోస్టు ఆమెను ఫాలో అయ్యే యువతకు నచ్చింది. అప్పటి నుంచి సైలెంట్ వాకింగ్ మెల్లమెల్లగా ప్రచారం పొందింది. ► మన గురించి ఆలోచిస్తున్నామా? మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి, మన లక్ష్యం వైపు దృష్టి నిలపడానికి ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఆఖరుకు నడకలో కూడా ఏదో ఒక అంతరాయం. ఇంటి నుంచి బయటకు వచ్చినా ఇంటి నుంచి ఫోన్ వస్తే ఇక ఇంట్లో ఉన్నట్టే తప్ప బయట ఉన్నట్టు అనిపించదు. ‘సైలెంట్ వాకింగ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి మన ఆలోచనలు మనల్ని వినేలా చేస్తుంది... రెండు ప్రకృతిని విని స్పందించేలా చేస్తుంది’ అని ఒక సైలెంట్ వాకర్ చెప్పింది. మరో స్టూడెంట్ అయితే ‘ఫోన్లు పారేసి హాయిగా అరగంట సేపు నడిస్తే నాకు చాలా స్వేచ్చతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదీగాక నా చదువు మీద దృష్టి నిలుస్తోంది’ అని చెప్పింది. ► వొత్తిడి తగ్గుతుంది భవ బంధాలు తెంచుకున్నట్టుగా ఏ కమ్యూనికేషన్ లేకుండా కనీసం రోజులో 30 నిమిషాలు ఒక రకమైన ఏకాంత సమయం గడపడమే సైలెంట్ వాకింగ్. దీని వల్ల యాంగ్జయిటీ వంటివి తగ్గి మానసికంగా ఒక ప్రశాంతత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఐదు నిమిషాలు ఫోన్ కనపడకపోతే కంగారు పడేవారు అరగంట ఫోన్‌ను ఇంట్లో పడేసి బయట పడి నడిస్తే ఆ స్వేచ్ఛ మనసుకు దొరుకుతుంది. ఈ అరగంటలో కొంపలేమీ మునిగిపోవు అని తెలుస్తుంది. మన గుప్పిట్లో ఫోన్ ఉన్నంత సేపు మెడ మీద కత్తి వేళ్లాడుతున్న భావనే... ఎప్పుడు ఎవరు ఏ విధంగా డిస్ట్రబ్ చేస్తారో తెలియదు కదా. ధ్యానంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం, ఆలోచనలను పరిశీలించుకోవడం ముఖ్యం అంటారు. సైలెంట్ వాకింగ్‌లో నడుస్తూ అలాంటి పనే చేస్తాం. క్రిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు పోయేందుకు దోహదం చేసేదే సైలెంట్ వాకింగ్. మౌన మునులుగా మారి రేపటి నుంచి మౌన నడకకు బయలుదేరండి. -
సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్
దేశంలోని అతిపెద్ద పైపుల బ్రాండ్‌కు బిలియనీర్ యజమాని, సందీప్ ఇంజనీర్ బిలియనీర్‌గా అవతరించడం వెనుక చాలా కష్టాలున్నాయి. జీవితంలో చాలా హెచ్చుతగ్గులు చవి చూశారు. కానీ విజయవంతమైన పారిశ్రామికవేత్త కావాలనే అతని సంకల్పం ముందు అన్నీ ఓడిపోయాయి. 2019లో ఆస్ట్రల్ పైప్స్ వ్యవస్థాపకుడిగా సందీప్ ఇంజనీర్ గౌరవనీయమైన బిలియనీర్స్ క్లబ్లోకిఎంట్రీ ఇచ్చారు. మామూలు ఫార్మ ఉద్యోగి నుంచి 21 వేల కోట్ల రూపాయల కంపెనీకి యజమానిగా సందీప్ సక్సెస్ఫుల్ జర్నీ..! గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని కాడిలా ల్యాబ్స్‌లో పనిచేసేవారు సందీప్. 20 ఏళ్ల వయసులో 1980లలో వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.. ఆ సమయంలో అతనికి వ్యాపారం చేయడంలో అనుభవంలేదు కుటుంబ నేపథ్యమూ లేదు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేశారు. ఇసాబ్గోల్ అనే తొలి వెంచర్‌ను స్టార్ట్ చేశారు. కానీ అక్కడ విజయం సాధించలేకపోయారు. వ్యాపారంలో విఫలమయ్యారు. ఒక దశలో చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ క్రమంలో పంకజ్ పటేల్ అనే బిలియనీర్ వ్యాపారవేత్త సందీప్‌కు మార్గదర్శకత్వం వహించడంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది పంకజ్‌పటేల్ మద్దతుతో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల (API) వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇక్కడ లాభనష్టాలతో పోరాటం తప్పలేదు. తమ ఉత్పత్తులు నిరుపయోగంగా మారడంతో వాటిని మార్చాల్సి వచ్చింది. కానీ ఆ తరువాత ఇంజనీర్ క్లోరినేటెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ (సీపీవీసీ) పైపుల వ్యాపారంలో జాక్‌పాట్ కొట్టారు. ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ అమెరికా నుంచి వచ్చిన కొత్త ఆవిష్కరణ 1998లో సందీప్ ఇంజనీర్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ అనే కొత్త వ్యాపారానాకి నాంది పలికింది. మొదట్లో దీన్ని చాలామంది విశ్వసించ నప్పటికీ, క్రమం బలం పుంజుకుంది. 2000ల ప్రారంభంలో సందీప్ ప్లంబింగ్ పైపుల తయారీ సంస్థగా బ్రాండ్‌ను స్థాపించారు. ఆ తరువాత 2010ప్రారంభంలో కుమారులు కైరవ్, సౌమ్య అందిరావడంతో సందీప్‌కు మరింత కలిసి వచ్చింది. 2003లో రూ 15 కోట్ల ఆదాయం ఒక్క ఏడాదిలోనే 25 కోట్లకు పెరిగింది. 2007లో, 60కోట్ల వాల్యూతో ఆస్ట్రాల్కు ఐపీఓవకు వచ్చింది. దీని ద్వారా రూ. 35 కోట్లను సేకరించింది. 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆస్ట్రల్ స్పాన్సర్‌గా ఉంది. (సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్) దబాంగ్ సిరీస్, బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ వీటన్నింటికి మించి 2014లో ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో రెండేళ్ల ఒప్పందం కంపెనీ బ్రాండ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేసింది. అంతకుమందు సల్మాన్ నటించిన 'దబాంగ్-2' చిత్రంతో భాగస్వామ్యం సక్సెస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) కాగా 2023, ఏప్రిల్ నాటికి సందీప్ నెట్‌వర్త్ 21 వేల కోట్ల రూపాయలు. అసలు బిలియనీర్ కావాలనేది తన కోరిక కాదు. ఇదంతా శరవేగంగా జరిపోయిందని గతంలో ఫోర్బ్స్తో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సందీప్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ రిటైల్, రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్స్, ఇతర పరిశ్రమలోని అన్ని రంగాలలో బలమైన క్లయింట్ బేస్ ఉంది. ఆస్ట్రల్‌కు అమెరికా, యూకే, కెన్యాలో సహా పలు ప్రదేశాల్లో ఫ్యాక్టరీలున్నాయి. -
భారత్, రష్యాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధం!
రష్యా కొత్త విదేశాంగ విధానంపై చైనా సానూకూలంగా స్పందించింది. దీని గురించి విలేకరులు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందన కోరగా..చైనా రష్యా, భారత్ గుర్తించదగిన రీతిలో అతిపెద్ద శక్తులుగా ఎదుగుతున్నాయి. పైగా ప్రభావంతంగా అభివృద్ధి చెందుతున్నాయి కూడా. ప్రస్తుతం అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు సంక్లిష్ట మార్పులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా, భారత్ సహా అంతర్జాతీయ సమాజంతో సంబంధాల బలోపేతం చేసుకోవడానికి తాముగా సిద్ధంగా ఉన్నాం. అంతేగాదు పరస్పర గౌరవం, శాంతియుత జీవన, గెలుపు-విజయాల సహకారంతో కూడిన ఈ సరికొత్త విదేశాంగ విధానంతో సంబంధాలను మరింతగా పెంపొందించడానికి చైనా రష్యాలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. అని చెప్పారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత శుక్రవారమే కొత్త విదేశాంగ విధానంపై సంతకం చేశారు. దీనిలో రష్యా చైనా, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసే దౌత్యపరమైన ప్రాధాన్యత గురించి పేర్కొంది. ఈ మేరు 42 పేజీల ఆ కొత్త విదేశాంగ విధానం డాక్యుమెంట్లులో చైనా భారత్ సంబంధాలను ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. అంతేగాదు యురేషియా ఖండంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుకోవడం, సమన్వయం చేసుకోవడం వంటి ప్రాముఖ్యతనును కూడా రష్యా నొక్కి చెప్పింది. అలాగే ఈ ప్రాంతంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తామని, అలాగే ప్రత్యర్థి దేశాలు, కూటములు చేపట్టే ‘విధ్వంసకర చర్యల’ను నిరోధిస్తామని పుతిన్ ఆ విదేశాంగ విధానంలో వివరించారు. (చదవండి: భారత్ ఐడ్రాప్స్ యూఎస్ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ) -
రానున్న బడ్జెట్లో ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్ సేవింగ్, ఇతర స్మాల్ సేవింగ్ పథకాలకు ఊరట లభించనుందా అంటే అవుననే సంకతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్‌కు ఈ దఫా చివరి బడ్జెట్ నేపథ్యంలో చిన్న పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం లభించనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలు పెద్ద ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ బడ్జెట్ 2023లో ఆర్థిక లోటును పూరించుకునేందుకు ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై ఆధారపడే అవకాశం ఉందని, వాటి నుండి దాదాపు రూ. 5 లక్షల కోట్లు సేకరించవచ్చని అంచనా. సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకం 2023-24 కోసం రాబోయే కేంద్ర బడ్జెట్లో ఊపందుకోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి చిన్న పొదుపు పథకాలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ పథకం 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినా ఇందులో ఎస్‌ఎస్‌వైని చేర్చకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. 10 సంవత్సరాల లోపు ఆడబిడ్డ ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం మొత్తం రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా అధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. 60 యేళ్లకు మించిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ముందస్తు పదవీ విరమణ చేసిన 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం దీనిపై 8 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ఈ స్కీంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పెట్టుబడిపై రూ .1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇవి తింటే మూడంతా సెట్..!!
-
Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ వంటి ఆన్లైన్ సర్వీసుల ఊతంతో దేశీయంగా వినియోగదారులకు సంబంధించిన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 నాటికి 800 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2020లో ఇది 85–90 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రౌండ్ జీరో 5.0 కార్యక్రమంలో ఆవిష్కరించిన కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఆవిష్కరించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారం వార్షిక పరిమాణం ఈ ఏడాది 55 బిలియన్ డాలర్లను తాకనుండగా..2030 నాటికి ఏకంగా 350 బిలియన్ డాలర్లకు చేరనుంది. తద్వారా అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద రిటైల్‌మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించనుంది. అటు కిరాణా దుకాణాల విక్రయాలు 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని రెడ్ సీర్ పేర్కొంది. ‘సౌకర్యం కారణంగానే ఆన్లైన్ సర్వీసులు వినియోగిస్తున్నామని ప్రస్తుతం 50 శాతం మంది కస్టమర్లు చెబుతున్నారు. అదే కొన్నేళ్ల క్రితం అయితే డిస్కౌంట్ల గురించి ఉపయోగిస్తున్నామని చెప్పేవారు. కోవిడ్ పరిస్థితులే తాజా మార్పులకు కారణం‘ అని రెడ్‌సీర్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ తెలిపారు. తదుపరి తరం ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. భారత మోడల్‌ను అంతర్జాతీయంగా కూడాప్రాచుర్యంలోకి తెచ్చే విధమైన కొత్త ఆవిష్కరణలను సృష్టించగలరని ఆయన పేర్కొన్నారు. (Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు) ప్రత్యామ్నాయ కేంద్రంగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని నివేదికవిడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇతర దేశాల్లోని సంస్థలు తమ కార్యకలాపాలను వేరే దేశాలకు మార్చుకునేందుకు తగు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయన్నారు. భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. తద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక భాగం కావచ్చని కాంత్ తెలిపారు. మరోవైపు, భారీ పెట్టుబడులు అవసరమైన చిప్ పరిశ్రమ భారత్‌లో ఏర్పడే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్‌చంద్రశేఖరన్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు.. సెమీ కండక్టర్ వ్యవస్థపై ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయ పడ్డారు. నివేదిక ప్రకారం.. 2020-30 మధ్య కొత్తగా జతయ్యే ఆన్లైన్ షాపర్స్‌లో 88 శాతం మంది ద్వితీయ శ్రేణి తదితర నగరాలకు చెందిన వారై ఉంటారు. ఈ-కామర్స్ వ్యాప్తి చెందే కొద్దీ ప్రత్యేక డెలివరీ సర్వీసుల అవసరం కూడా పెరిగింది. (LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’) -
‘ఉప’ ఫలితాలతో ఉత్సాహం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా బీజేపీకి, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్ ఫలితాలు బీజేపీని బాగా సంతోషపరిచాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలను చేజిక్కించుకోవడం ఆ రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలనిచ్చింది. ఆ పార్టీ బలం ఒక్కసారిగా 126కి పెరిగింది. కరోనా వైరస్ దేశమంతా అలుముకున్న తొలి దినాల్లో... అంటే మొన్న మార్చిలో అక్కడ రాజకీయ సంక్షోభం రాజుకుని జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌నుంచి బయటికొచ్చారు. దాంతో అప్పటికి 15 నెలలుగా అధికారంలో కమల్‌నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కొనడానికి ముందే రాజీనామా చేసింది. బీజేపీ సీనియర్ నేత శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 107మంది సభ్యుల బలంతో అప్పటినుంచీ అది నెట్టుకొస్తోంది. రాజీనామాలవల్ల, ఇతరత్రా కారణాలతో మొత్తం 28 స్థానాలు ఖాళీ కాగా వాటికి గత నెలలో ఉప ఎన్నికలు జరిగాయి. తగినంత బలం లేకున్నా పాలన సాగించవలసి వస్తోంది గనుక శివరాజ్ సింగ్ చౌహాన్ తరచు తనను తాను ‘తాత్కాలిక సీఎం’గా చెప్పుకునేవారు. 2005 నుంచి 2018 వరకూ పాలించిన చౌహాన్‌కు ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే నెగ్గినవారిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి పార్టీలోకొచ్చిన జ్యోతిరా దిత్య సింథియా అనుయాయులు. వారు పార్టీ కన్నా జ్యోతిరాదిత్యకే విశ్వాసపాత్రులుగా వుంటారు. కనుక చౌహాన్‌పై మున్ముందు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. గతంలో ఆయనది ఏకచ్ఛత్రాధిపత్యం. ఈ ఉప ఎన్నికలు ఇటు జ్యోతిరాదిత్యకూ, అటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌కూ పెద్ద పరీక్షగా మారాయి. తన అనుచర గణాన్ని గెలిపించుకోలేకపోతే బీజేపీలో జ్యోతిరాదిత్య స్థానం బలపడదు. అలాగే ఇన్నాళ్లూ జ్యోతిరాది త్యకు పార్టీ బలమే తప్ప సొంత బలమేమీ లేదని చెబుతూ వస్తున్న కమల్‌నాథ్‌పై దాన్ని నిరూపించ వలసిన భారం పడింది. అందువల్లే ఉప ఎన్నికల ఫలితాలతో ఆయన డీలా పడ్డారు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో తనకు రాజకీయంగా పట్టుందని జ్యోతిరాదిత్య రుజువు చేసుకున్నారు. మరో 9 స్థానాల్లో ఫిరాయింపుదార్లను ఓడించి, విజయం సాధించడమే కాంగ్రెస్‌కు ఉన్నంతలో ఓదార్పు. అచ్చం మధ్యప్రదేశ్ తరహాలోనే గుజరాత్లో కూడా 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఫిరాయించారు. వారిలో అయిదుగురికి ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు లభించాయి. తాజాగా ఈ ఎనిమిదిచోట్లా కాంగ్రెస్ ఓడిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్తెసరు మెజారిటీయే లభించింది. 182మంది సభ్యుల అసెంబ్లీలో 1995 తర్వాత తొలిసారి ఆ పార్టీ బలం 99కి పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాలం సీఎంగా పనిచేసిన బీజేపీకి ఇది భంగ పాటే. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలు గెల్చుకుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేనాటికి సీఎం విజయ్ రూపానీని మార్చే అవకాశం వుందన్న కథనాలు వెలువడుతున్న దశలో అన్ని స్థానా లనూ పార్టీ గెల్చుకోవడం రూపానీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. మణిపూర్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయిదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ నాలుగు గెల్చుకోగా, మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థి నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఆరింటిని బీజేపీ గెల్చుకుంది. ఒక చోట సమాజ్‌వాదీ పార్టీ స్వల్ప ఆధిక్యతతో సీటు నిలబెట్టుకుంది. అత్యాచారం, హత్య కేసుల్లో శిక్ష అను భవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ నేతృత్వంవహించిన బంగార్మవ్ నియోజక వర్గంలో సైతం బీజేపీ అభ్యర్థే విజయం సాధించారు. హథ్రాస్‌లో యువతిపై అత్యాచారం, ఆమె భౌతి కకాయానికి అర్థరాత్రి పోలీసులే అంత్యక్రియలు జరపడం వంటి ఘటనల ప్రభావం ఉప ఎన్నికలపై కనబడకపోవడం గమనించదగ్గది. ఉత్తరప్రదేశ్ ఫలితాలకు విపక్షాల బాధ్యత కూడా వుంది. ఈ ఏడు చోట్లా నేరుగా యోగి ఆదిత్యనాథ్ సభలూ, సమావేశాలూ నిర్వహించారు. మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియింకగాంధీ ఒక్కచోట కూడా ప్రచారానికి వెళ్లలేదు. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక స్థానాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుంది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఉన్నంతలో ఛత్తీస్‌గఢ్, హరియాణాల్లో రెండు స్థానాలు, జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి రెండు స్థానాలు గెల్చుకోవడం మాత్రమే కాంగ్రెస్‌కు ఊరట. అయితే జార్ఖండ్‌లో అటు జేఎంఎంకూ, ఇటు కాంగ్రెస్‌కూ గతంలోకన్నా మెజారిటీ బాగా తగ్గడం ఆందోళన కలిగించే అంశమే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన సాగు బిల్లులపై ఆందోళన జరుగుతున్న హరియాణాలో బరోడా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ–జేజేపీ ఉమ్మడి అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన రెండు ఉప ఎన్ని కల్లోనూ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలకూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ చాలా వ్యత్యాసం వుంటుంది. సాధా రణంగా ఉప ఎన్నికలు వాటికవే ఒక ధోరణిని ప్రతిబింబించవు. ఎక్కువ సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వుండే అధికార పక్షాలకు అనుకూలంగా వుండే అవకాశం వున్నా అభ్యర్థి ఎంపిక మొదలుకొని అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలతో మొదలుపెట్టి కుల సమీకరణాల వరకూ ఎన్నెన్నో అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాల్లో ఎక్కడ లెక్క తప్పినా పార్టీలకు సమస్యలెదురవుతాయి. అధికారంలో వున్న పక్షం నగుబాటుపాలవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్ని కలో, మరో ఎన్నికలో వచ్చే అవకాశం వుంటే ఈ ఫలితాలను చూపి భవిష్యత్తు తమదేనని శ్రేణులకు చెప్పుకోవడానికి ఏ పార్టీకైనా అవకాశం వుంటుంది. అందుకే అధికారంలో వున్న పార్టీ ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ కేంద్రీకరిస్తుంది. మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు నిరాశ మిగల్చగా, బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి. -
ఉద్యోగులకు పండగ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పలు చర్యలు ప్రకటించారు. వినిమయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ వోచర్, పండుగ ప్రత్యేక అడ్వాన్స్ పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని, డిజిటల్ మాధ్యమం ద్వారా వీటిని వెచ్చించాలని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ ఇన్వాయిస్ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ప్రకటించగా తాజాగా వ్యవస్థలో డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలను ప్రకటించామని చెప్పారు. వస్తువులను కొనుగోలు చేయడానికి వోచర్లు వాడే అవకాశం కల్పిస్తున్నామని, తమకు నచ్చిన ప్రాంతానికి, తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఎల్టీసీ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వీటిపై ఎలాంటి ఆదాయం పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో దూకుడు పెంచేందుకు వినియోగదారుల నుంచి డిమాండ్, మూలధన వ్యయం పెరగాల్సి ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం విషయంపై సోమవారం మద్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సమావేశంలో పాల్గొంటారు. చదవండి : వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
హెచ్‌యూఎల్‌కు హార్లిక్స్ బూస్ట్
న్యూఢిల్లీ: దేశ ఎఫ్ఎంసీజీ రంగంలో భారీ డీల్ సాకారమైంది. ఫలితం... దేశీయ న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్స్ మార్కెట్లోకి ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇటీవలే కాంప్లాన్ బ్రాండ్ చేతులు మారగా... దశాబ్దాలుగా న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్స్ విభాగంలో దేశంలో టాప్ బ్రాండ్లుగా వెలుగుతున్న... గ్లాక్సో స్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్‌కు (జీఎస్కే) చెందిన హార్లిక్స్, బూస్ట్ ఇక హెచ్‌యూఎల్ చేతిలోకి వెళ్లాయి. ఈక్విటీ విలీనం రూపంలో జరిగే ఈ డీల్ విలువ 3.1 బిలియన్ పౌండ్లు (రూ.27,750 కోట్లు). భారత్‌తో పాటు ఆసియాలోని మరో 20కి పైగా దేశాల్లో జీఎస్కేకు చెందిన ఫుడ్, డ్రింక్స్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేస్తున్నట్టు హెచ్‌యూఎల్ మాతృ సంస్థ యూనిలీవర్ ప్రకటించింది. యూనిలీవర్‌కు చెందిన భారత విభాగం హెచ్‌యూఎల్... ఈక్విటీ విలీనం రూపంలో జీఎస్కే హెల్త్‌కేర్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు హెచ్‌యూఎల్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ ఇండియాను పూర్తిగాను, జీఎస్కే బంగ్లాదేశ్ లిమిటెడ్‌లో 82 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు, వీటితోపాటు భారత్‌కు వెలుపల పలు వాణిజ్య ఆస్తులు కూడా ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయని యూనిలీవర్ తెలిపింది. విలీనంలో భాగంగా జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ వాటాదారులకు వారి వద్దనున్న ప్రతీ ఒక్క షేరుకు 4.39 హెచ్‌యూఎల్ షేర్లను జారీ చేస్తుంది. ఈ విలీనం ఇరు కంపెనీల వాటాదారులు, నియం త్రణ సంస్థల ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. జీఎక్‌కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ ఇండియాలో జీఎస్కేకు 72.5 శాతం వాటా ఉండగా, హెచ్‌యూఎల్‌లో యూనిలీవర్‌కు 67.2 శాతం వాటా ఉంది. భారత్ మాకు కీలక మార్కెట్: జీఎస్కే హార్లిక్స్ భారత్‌లో ఎన్నో దశాబ్దాలుగా జీఎస్కేకు ఆదాయాన్ని, వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందించిందని ఈ కంపెనీ సీఈవో ఎమ్మా వామ్‌స్లే అన్నారు. ఈ బ్రాండ్ భవిష్యత్తు అవకాశాలను యూనిలీవర్ అందుకోగలదన్న ఆశాభాశాన్ని వ్యక్తం చేశారు. ఈ డీల్ ద్వారా తమకొచ్చే నిధులను ఫార్మా వ్యాపారం, గ్రూపు వ్యూహాత్మక ప్రాధాన్యతల కోసం వినియోగిస్తామని ఆమె చెప్పారు. భారత్ ఇకముందూ తమకు ముఖ్యమైన మార్కెట్‌గా ఉంటుం దని జీఎస్కే ప్రకటించింది. ఓటీసీ, క్రోసిన్, ఈనో, సెన్సోడైన్ తదితర ఓరల్ హెల్త్ బ్రాండ్ల విభాగంలో వృద్ధి అవకాశాల కోసం పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. జీఎస్కే కన్జ్యూమర్‌ను విలీనం చేసుకోనున్న హెచ్‌యూఎల్... ఐదేళ్లపాటు జీఎస్కేకు చెందిన ఓటీసీ, ఓరల్ హెల్త్ బ్రాండ్లను కూడా పంపిణీ చేస్తుంది. ఇది కూడా ఒప్పందంలో భాగం. హెచ్‌యూఎల్ షేరు ఆల్‌టైమ్ హై... జీఎస్కే హెల్త్‌కేర్ కొనుగోలు హెచ్‌యూఎల్ షేర్లపై ఇన్వెస్టర్లలో ఆసక్తికి దారితీసింది. దీంతో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో 4 శాతానికి పైగా లాభపడి రూ.1,826 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 4.89 శాతం వరకు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 1,839ని నమోదు చేయడం గమనార్హం. హెల్త్‌డ్రింక్స్ మార్కెట్లో కొత్త పోటీ న్యూట్రిషనల్ హెల్త్‌డ్రింక్స్ విభాగంలో కొత్త పోటీ నెలకొందనే చెప్పాలి. దశాబ్దాలుగా హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, కాంప్లాన్ తదితర బ్రాండ్లు భారతీయులకు ఎంతో సుపరిచితం. అయితే, ఈ విభాగంలో వృద్ధి తగ్గుతోంది. చక్కెర అధికంగా ఉండే ఉత్పత్తులకు వినియోగదారులు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. హార్లిక్స్‌లో 20 శాతం పంచదారే. దీంతో బహుళజాతి సంస్థలు కొత్త మార్గాలను చూడకుండా తమ బ్రాండ్లను అమ్ముకోవడంపై దృష్టి సారించాయి. దీంతో కాంప్లాన్, హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్లు చేతులు మారాయి. అమెరికాకు చెందిన క్రాఫ్ట్హీంజ్ నుంచి కాంప్లాన్తో పాటు గ్లూకోన్ డి, నైసిల్ను రూ.4,595 కోట్లు వెచ్చించి అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ వెల్నెస్ అక్టోబర్‌లో కొనుగోలు చేసింది. ఈ విభాగంపై భారీ ఆశలతోనే భారీ డీల్‌కు జైడస్ ముందడుగు వేసింది. ఇక హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్ల కోసం అగ్రగామి ఎఫ్ఎంసీజీ నెస్లే కూడా యూనిలీవర్‌తో పోటీపడటం గమనార్హం. సుదీర్ఘ చరిత్ర... ‘‘హార్లిక్స్ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వారసత్వం, విశ్వసనీయత ఉన్నాయి. ఈ కొనుగోలు మా ఆహారం, రిఫ్రెష్మెంట్ వ్యాపారాన్ని సమూలంగా మార్చేస్తుంది. ఆరోగ్య పానీయాల విభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తుంది. ఆరోగ్య విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది’’ అని యూనిలీవర్ ప్రెసిడెంట్ నితిన్ పరాంజపే తెలిపారు. గొప్ప ఉత్పత్తుల ద్వారా తమ వినియోగదారుల పోషకావసరాలను తీర్చే విభాగంలోకి ప్రవేశించేందుకు ఈ వ్యూహాత్మక విలీనంతో వీలవుతుందని హెచ్‌యూఎల్ చైర్మన్, సీఈవో సంజీవ్ మెహతా తెలిపారు. ‘‘మా ఆహారం, రీఫ్రెష్‌మెంట్స్ (ఎఫ్అండ్ఆర్) వ్యాపార టర్నోవర్ రూ.10,000 కోట్లను అధిగమించగలదు. ఈ విభాగంలో దేశంలో ఒకానొక అతిపెద్ద సంస్థగా ఉంటాం’’ అని మెహతా తెలిపారు. ప్రస్తుతం తమ ఎఫ్అండ్ఆర్ వ్యాపారం రూ.2,400 కోట్లుగా ఉన్నట్టు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో శ్రీనివాస్ పాఠక్ తెలిపారు. మధ్య కాలానికి రెండంకెల స్థాయిలో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని, తమకు ఈ కొనుగోలు ఒక భారీ వ్యాపార అవకాశమని పేర్కొన్నారు. డీల్‌లో ముఖ్యాంశాలివీ.. హెచ్‌యూఎల్ సొంతం కానున్న బ్రాండ్లు... హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, వివా. ఇందులో హార్లిక్స్ బ్రాండ్ జీఎస్కే ఇండియా పరిధిలో కాకుండా, మాతృసంస్థ జీఎస్కే చేతిలో ఉంది. ఈ బ్రాండ్‌ను తాము కొనుగోలు చేయడం లేదని, అయినప్పటికీ ఈ వ్యాపారంపై తమకు హక్కులుంటాయని హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో పాఠక్ తెలిపారు. ప్రతి ఒక జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ షేరుకు 4.39 షేర్లను కేటాయిస్తారు. ఈ ప్రకారం జీఎస్కే హెల్త్‌కేర్ ఇండియా షేరు విలువ రూ.7,540. విలీనం తర్వాత హెచ్‌యూఎల్‌లో జీఎస్కేకు 5.7 శాతం వాటా లభిస్తుంది. అయితే, ఈ విలీన డీల్ ముగిశాక తమ వాటాను విక్రయిస్తామని జీఎస్కే ప్రకటించింది. ఈ డీల్ 2019 చివరి నాటికి పూర్తవుతుందని ఇరు కంపెనీల అంచనా. 140 సంవత్సరాలపై మాటే... హార్లిక్స్ బ్రాండ్‌కు 140 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అందుకే భారీగా చెల్లించేందుకు యూనిలీవర్ ధైర్యం చేసింది. రూ.10,000 కోట్ల వ్యాపార టర్నోవర్‌కు అధిక మొత్తంలో చెల్లించేం దుకు ముందుకు వచ్చింది. హార్లిక్స్, బూస్ట్, వివా, 800 డిస్ట్రిబ్యూటర్లుతోపాటు హెల్త్ ఫుడ్ డ్రింక్ మార్కెట్లో 50 శాతం వాటా హెచ్‌యూఎల్ సొంతమవుతాయి. మరి హెచ్‌యూఎల్‌కు దేశవ్యాప్తంగా 70 లక్షల రిటైల్ స్టోర్లతో అనుసంధానత ఉంది. దీంతో హెచ్‌యూఎల్ తనకున్న బలం తో హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్ల వ్యాపారం పెంచుకోగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
వారికి ఊరట : దిగుమతి సుంకం రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ వస్త్ర ఉత్పత్తులకు, ఉత్పత్తిదారులు, ఊరట నిచ్చేలా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. భారీ సంఖ్యలో ఈ ఉత్పత్తులపై 20 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను మంగళవారం ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించింది. 328 రకాల వస్త్ర ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ లోకసభకు చెప్పారు. దిగుమతి చేసుకునే వస్త్ర ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కస్టమ్స్ యాక్ట్ (1962) సెక్షన్ 159 ప్రకారం రెట్టింపునకు నిర్ణయించినట్టు తెలిపారు. తద్వారా దేశీయ తయారీదారులకు మంచి ప్రోత్సాహం లభించడంతోపాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అయితే దిగుమతి చేసుకున్న వస్త్రాల ధరలుమాత్రం మోత మోగనున్నాయి. అలాగే కేంద్రం నిర్ణయంబ చైనా ఉత్పత్తులనే ఎక్కువగా ప్రభావితం చేయనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాగా గత నెలలో ప్రభుత్వం 50రకాల వస్త్రాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెండింతలు చేసింది. జాకెట్లు, సూట్లు, కార్పెట్లపై 20 శాతం దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. -
ఆ సమయంలో ఇవి తింటే స్మార్ట్ కిడ్..
న్యూయార్క్: మీరు తల్లి కాబోతున్నారా? చురుకైన, తెలివైన స్మార్ట్‌కిడ్ కావాలని కలలు కంటున్నారా? అయితే మీలాంటి వారికోసమే ఈ వార్త. బిడ్డ మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే గుడ్డులోని పచ్చసొన, నట్స్, క్యాబేజీ జాతికి చెందిన కూరగాయలు వంటి ఆహారాలు విరివిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పుట్టబోయే బిడ్డ మెదడుకు, జ్ఞాపక శక్తికి మంచి బూస్ట్ ఇస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. అంతేకాదు గర్భధారణ సమయంలో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని కోలైన్ విరివిగా తీసుకోవాలని చెబుతోంది. గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఎపుడూ పెద్ద ప్రశ్నే. ఎంత చదువుకున్న మహిళలైనా ఈ విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంటారు. అయితే గర్భధారణలో చివరి మూడు నెలల్లో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమని తాజా అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా కొవ్వు తీసేసిన ఎర్ర మాంసం, (లీన్ రెడ్ మీట్) చేపలు, గుడ్లు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుందని ఈ అధ్యయనం తేల్చింది. రోజువారీ ఈ ఆహార పదార్ధాల వినియోగంతో బిడ్డల ఎదుగుదలలో వేగం, విజువల్ జ్ఞాపకశక్తి నాలుగు, ఏడు, 10 , 13 నెలల వయస్సులో మెరుగుపర్చిందని ఈ అధ్యయనం సూచించింది. గర్భధారణ సమయంలో అధికంగా తీసుకోవాల్సిన కోలిన్ చాలామంది మహిళలు చాలా తక్కువ మోతాదులో తీసుకుంటున్నారనీ, రోజుకు సిఫార్సు చేయబడిన 450 మిల్లీగ్రాముల కన్నా తక్కువ వినియోగిస్తారు. కానీ, గర్భధారణ చివరి త్రైమాసికంలో ప్రతిరోజూ సిఫార్సు చేసిన కొలైన రిచ్ ఫుడ్స్ తినడం రెండుసార్లు కంటే ఎక్కువ తీసుకోవాలని తద్వారా పాపాయి ఎదుగుదల బావుంటుందని అధ్యయనం చెబుతోంది. ఆప్టిమల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ (సంక్లిష్ట సామర్ధ్యాలు మెదడు-ఆధారిత నైపుణ్యాలు:సరళంనుంచి చాలా సంక్లిష్టమైన పని అయినా నేర్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, పరిష్కారం, శ్రద్ధ వహించడం లాంటివి) మెరుగుపడతాయని తెలిపింది. న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ , మేరీ కాడిల్ ఆధ్వర్యంలో ఈ స్డడీ జరిగింది. తమ అధ్యయనంలో భాగంగా రెండు గ్రూపుల గర్భిణీలను పరిశీలించినట్టు చెప్పారు. మొదటి గ్రూపునకు రోజు కోలిన్ 930 మి.గ్రా. ఇవ్వగా, రెండవ గ్రూపునకు రోజుకు 480మి.గ్రా ఇవ్వగా ఇద్దరిలోనూ వేగమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ రెండవ గ్రూపు కంటే.. మొదటి గ్రూపులోని పిల్లలు మెదడు అభివృద్ధి గణనీయమైన ఫలితాలు కనిపించాయని స్టడీ పేర్కొంది. ఎఫ్ఏఎస్ఈబీ అనే జర్నల్ ఈ అధ్యయనం ప్రచురితమైంది. -
ఎఫ్ఐపీబీ రద్దుతో ఎఫ్‌డీఐల జోరు
-
ఎఫ్ఐపీబీ రద్దుతో ఎఫ్‌డీఐల జోరు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించేందుకు పాతికేళ్ల కిత్రం ఏర్పాటైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎఫ్ఐపిబి) రద్దుపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యకారణంగా విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా రానున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోకి విదేశీపెట్టుబడులకు మంచి బూస్ట్ ఇస్తుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే విధంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)ని రద్దు చేయడాన్ని సీఐఐస్వాగతించింది. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంద్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన దానికి కొనసాగిపుంగా ఎఫ్ఐపిబి రద్దు ప్రక్రియ ద్వారా ఎఫ్‌డీల జోరు పెరుగుతుందని, తద్వారా మరిన్న ఉపాధి అవకాశాలు రానున్నాయని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. భారత్ ఒక ఆచరణీయ వ్యాపార గమ్యస్థానంగా నిలవనుందని తెలిపారు. ప్రస్తుతం, కేవలం 11 రంగాల్లో మాత్రమే ఆమోదం ఉన్న పాతికేళ్లనాటి ఎఫ్ఐపీబీని రద్దు చేయడం, సింగిల్ విండో ద్వారా ఎఫ్‌డీఐ ప్రదిపాదనలను ఆమోదించడం వ్యాపార నిర్వహణలో సంస్కరణలు, వ్యాపార సరళీకరణ, పెట్టుబడిదారుల్లో విశాసాన్ని పెంచేందకు ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబింస్తోందని బెనర్జీ వ్యాఖ్యానించారు. అలాగే మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి వ్యూహాత్మక భాగస్వామ్యంతో దేశీయసంస్థల్లో టెక్నాలజీ బదిలీ మార్గాన్ని సుగమం చేసిందని పేర్కొన్నారు. కాగా బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఎఫ్ఐపిబి రద్దుకు ఆమోదం తెలిపింది. దీనిస్థానే కొత్త వ్యవస్థను త్వరలోనే ప్రకటిస్తారు. కొత్త వ్యవస్థలో విదేశీ పెట్టుబడి ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలు స్వయంగా పరిశీలించి ఆమోదిస్తాయి. ఇందుకు సంబంధించి ప్రామాణికమైన మార్గదర్శకాలను రూపొందిస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ కేబినెట్ చెప్పారు. కీలకమైన రంగాలు ముఖ్యంగా దేశ భద్రత, సమగ్రతతో ముడివడిన రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలకు హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. -
జీఎస్టీపై ఐఎంఎఫ్ పొగడ్తలు
వాషింగ్టన్: భారత ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణలను మరోసారి ప్రశంసించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( ఐఎంఎఫ్) ఇటీవల ఆమోదించిన జీఎస్టీ బిల్లుపై కూడా పొగడ్తలు కురిపించింది. వస్తు సేవల పన్ను అమలు దేశ మధ్యంతర వృద్ధికి మరింత ప్రోత్సాహాన్ని స్తుందని తెలిపింది. 2016లో దేశం సాధించిన ఆర్థికవృద్ధిని స్వాగతించిన సంస్థ ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని పేర్కొంది. తాజా ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ఎకానమిక్ అప్ డేట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది. సంస్కరణల కారణంగా రాబోయే రెండేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండనుందని అంచనా వేసింది. కొనసాగుతున్న వృద్ధి పునరుద్ధరణ వ్యక్తిగత వినియోగం ద్వారా మరింత సులువవుతుందని తెలిపింది. సాధారణ స్థాయిల్లో ఉన్న వర్షపాతం వ్యవసాయ వృద్ధికి శుభ సంకేతమని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా దేశీయ డిమాండ్ కు ఊతమిస్తాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. వాణిజ్యంలో భారీ పెరుగుదల, నిర్మాణాత్మక సంస్కరణలు, సరఫరా వైపు అడ్డంకుల క్రమంగా తగ్గింపు, లాంటి సానుకూల విధానపరమైన చర్యలు పరంగా అభివృద్ధి వృద్ధిలో ఉపయోగపడతాయని వెల్లడించింది. ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వృద్ధికి గ్రేటర్ లేబర్ మార్కెట్ ప్లెక్సిబిలిటీ, ఉత్పత్తి మార్కెట్ పోటీ అవసరమని తెలిపింది. దీనికి కొత్త కార్పొరేట్ రుణ పునర్నిర్మాణ విధానాల సమర్థవంతమైన అమలు కూడా ప్రభావితం చేస్తుందని సూచించింది. సంస్కరణల్లో పురోగతి ఇప్పటికే బలంగా ఉన్న విదేశీ పెట్టుబడుల వెల్లువను మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది. భారతదేశం, ఇండోనేషియా లోని యువశక్తి ( శ్రామిక వయసు జనాభా) వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థల్లో పటిష్ఠమైన వృద్ధికి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. -
గ్రామీణ మౌలిక అభివృద్ధికి ముందడుగు
ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగు పడటానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనికి తోడు రైతులకు వ్యవసాయ రుణాలకు అత్యధికంగా 9 లక్షల కోట్లు, ఎంఎన్ ఆర్ ఈజీఏ కి అత్యధికంగా 38,500 కోట్లు కేటాయించడం గ్రామీణ ఆర్థిక ప్రయోజనాలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. బడ్జెట్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకానికి 19,000 కోట్లు కేటాయించడం.. గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంచడంలో ముందడుగు వేసినట్లేనంటూ రాజ్ నాథ్.. అరుణ్ జైట్లీ బడ్జెట్ ను అభినందించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు ఈ ఏడాది బడ్జెట్ అనుకూలంగా ఉందని, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. అంతేకాక రహదారుల అభివృద్ధికి 55 వేల కోట్లు కేటాయించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడులతోపాటు, రైల్వేలో మూలధన వ్యయం కలిపి 2.2 లక్షల కోట్లు అధిగమిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఈ ఏడు బడ్జెట్ ముఖ్యంగా పేదల పెన్నిధిగా ఉందని, ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకం ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి 2,87,000 కోట్లు కేటాయించడం పంచాయితీరాజ్ సంస్థల బలోపేతానికి దీర్ఘకాలికంగా ఫలితం ఉంటుందని అన్నారు. తయారీ రంగ అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేక ప్రయోజనాలు కల్పించిందని హోంమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.