dabang
-
సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్
దేశంలోని అతిపెద్ద పైపుల బ్రాండ్‌కు బిలియనీర్ యజమాని, సందీప్ ఇంజనీర్ బిలియనీర్‌గా అవతరించడం వెనుక చాలా కష్టాలున్నాయి. జీవితంలో చాలా హెచ్చుతగ్గులు చవి చూశారు. కానీ విజయవంతమైన పారిశ్రామికవేత్త కావాలనే అతని సంకల్పం ముందు అన్నీ ఓడిపోయాయి. 2019లో ఆస్ట్రల్ పైప్స్ వ్యవస్థాపకుడిగా సందీప్ ఇంజనీర్ గౌరవనీయమైన బిలియనీర్స్ క్లబ్లోకిఎంట్రీ ఇచ్చారు. మామూలు ఫార్మ ఉద్యోగి నుంచి 21 వేల కోట్ల రూపాయల కంపెనీకి యజమానిగా సందీప్ సక్సెస్ఫుల్ జర్నీ..! గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని కాడిలా ల్యాబ్స్‌లో పనిచేసేవారు సందీప్. 20 ఏళ్ల వయసులో 1980లలో వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.. ఆ సమయంలో అతనికి వ్యాపారం చేయడంలో అనుభవంలేదు కుటుంబ నేపథ్యమూ లేదు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేశారు. ఇసాబ్గోల్ అనే తొలి వెంచర్‌ను స్టార్ట్ చేశారు. కానీ అక్కడ విజయం సాధించలేకపోయారు. వ్యాపారంలో విఫలమయ్యారు. ఒక దశలో చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ క్రమంలో పంకజ్ పటేల్ అనే బిలియనీర్ వ్యాపారవేత్త సందీప్‌కు మార్గదర్శకత్వం వహించడంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది పంకజ్‌పటేల్ మద్దతుతో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల (API) వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇక్కడ లాభనష్టాలతో పోరాటం తప్పలేదు. తమ ఉత్పత్తులు నిరుపయోగంగా మారడంతో వాటిని మార్చాల్సి వచ్చింది. కానీ ఆ తరువాత ఇంజనీర్ క్లోరినేటెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ (సీపీవీసీ) పైపుల వ్యాపారంలో జాక్‌పాట్ కొట్టారు. ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ అమెరికా నుంచి వచ్చిన కొత్త ఆవిష్కరణ 1998లో సందీప్ ఇంజనీర్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ అనే కొత్త వ్యాపారానాకి నాంది పలికింది. మొదట్లో దీన్ని చాలామంది విశ్వసించ నప్పటికీ, క్రమం బలం పుంజుకుంది. 2000ల ప్రారంభంలో సందీప్ ప్లంబింగ్ పైపుల తయారీ సంస్థగా బ్రాండ్‌ను స్థాపించారు. ఆ తరువాత 2010ప్రారంభంలో కుమారులు కైరవ్, సౌమ్య అందిరావడంతో సందీప్‌కు మరింత కలిసి వచ్చింది. 2003లో రూ 15 కోట్ల ఆదాయం ఒక్క ఏడాదిలోనే 25 కోట్లకు పెరిగింది. 2007లో, 60కోట్ల వాల్యూతో ఆస్ట్రాల్కు ఐపీఓవకు వచ్చింది. దీని ద్వారా రూ. 35 కోట్లను సేకరించింది. 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆస్ట్రల్ స్పాన్సర్‌గా ఉంది. (సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్) దబాంగ్ సిరీస్, బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ వీటన్నింటికి మించి 2014లో ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో రెండేళ్ల ఒప్పందం కంపెనీ బ్రాండ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేసింది. అంతకుమందు సల్మాన్ నటించిన 'దబాంగ్-2' చిత్రంతో భాగస్వామ్యం సక్సెస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) కాగా 2023, ఏప్రిల్ నాటికి సందీప్ నెట్‌వర్త్ 21 వేల కోట్ల రూపాయలు. అసలు బిలియనీర్ కావాలనేది తన కోరిక కాదు. ఇదంతా శరవేగంగా జరిపోయిందని గతంలో ఫోర్బ్స్తో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సందీప్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ రిటైల్, రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్స్, ఇతర పరిశ్రమలోని అన్ని రంగాలలో బలమైన క్లయింట్ బేస్ ఉంది. ఆస్ట్రల్‌కు అమెరికా, యూకే, కెన్యాలో సహా పలు ప్రదేశాల్లో ఫ్యాక్టరీలున్నాయి. -
సల్మాన్ సినిమాతో ఎంట్రీ.. బాలీవుడ్‌ను ఏలేశారు
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫేమస్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్లలో ఒకరైన వాజిద్ ఖాన్ ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాజిద్ ప్రాణాలు విడిచారు. సల్మాన్ ఖాన్ హీరోగా 1998లో వచ్చిన ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ చిత్రంతో సాజిద్-వాజిద్ ద్వయం బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. దాదాపు 20 ఏళ్ల సినీ ప్రయాణంలో వీరిద్దరు ఎన్నో సూపర్‌హిట్ పాటలకు సంగీతం అందించారు. వాటిలో బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని పాటల వివరాలు... ప్యార్ కియాతో డర్నా క్యా(1998) సల్మాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ద్వారా సాజిద్-వాజిద్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అర్భాజ్ ఖాన్‌పై తెరకెక్కించిన తేరి జవానీ సాంగ్‌ను సాజిద్-వాజిద్ ద్వయం కంపోజ్ చేశారు. ఈ సినిమా నుంచే సల్మాన్ ఖాన్‌కు, వాజిద్‌కు మధ్య స్నేహం కుదిరింది. హలో బ్రదర్(1999) మరుసటి ఏడాదే సాజిద్-వాజిద్, సల్మాన్ హీరోగా నటించిన హలో బ్రదర్ చిత్రానికి.. హిమేష్ రేషమ్మియాతో పాటు సంగీతం అందించారు. ఈ చిత్రంలో ‘ఏరియా కా హీరో’, ‘హతా సావన్ కి ఘాటా’, ‘చుప్కే సే కోయి’తో పాటు హలో బ్రదర్ టైటిల్ ట్రాక్‌తో కలిపి మొత్తం నాలుగు పాటలకు సాజిద్-వాజిద్ సంగీతం అందించారు. తుమ్కో నా భూల్ పాయెంగే (2002) 1999 నుంచి 2002 కాలంలో కొన్ని హిట్ ట్రాక్‌ల తర్వాత సాజిద్-వాజిద్ ద్వయం మరోసారి సల్మాన్ చిత్రానికి సంగీతం అందించారు. సుస్మితా సేన్, దియా మీర్జా హీరోయిన్లుగా, సల్మాన్ హీరోగా నటించిన తుమ్కో నా భూల్ పాయెంగే చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ముబారక్ ఈద్ ముబారక్’ పాట బాగా ప్రాచుర్యం పొందింది. తేరే నామ్ (2003) సల్మాన్ ఖాన్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘తేరే నామ్’ ఒకటి. ఈ సినిమాకు కూడా సాజిద్-వాజిద్ ద్వయం, హిమేష్ రేషమ్మియాతో కలిసి సంగీతం సమకూర్చారు. చిత్రంలోని ‘సాథ్ జో మేరా చోడా’ పాట బాగా ప్రసిద్ధి చెందింది. ముజ్సే షాదీ కరోగి, గర్వ్ (2004) 2004 సంత్సరం భాయిజాన్‌తో పాటు సాజిద్-వాజిద్లకు కూడా బాగా కలసి వచ్చింది. ఆ ఏడాది సల్మాన్ నటించిన ముజ్సే షాదీ కరోగి, గర్వ్ చిత్రాలు రెండు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లోని మొత్తం 12 పాటలకు సాజిద్-వాజిద్ ద్వయం సంగీతం అందించారు. ‘గర్వ్’ చిత్రంలోని ‘హమ్ తుమ్కో నిగహోన్ మెయిన్’, ‘దమ్ మస్త్ మస్త్’, ‘సోనియే తో సోనీ’, ‘ఫరియాద్ క్యా కరే హామ్’, ‘తేరే హై దివానా దిల్’ పాటలకు సంగీతం అందించారు. అలానే ‘ముజ్సే షాదీ కరోగి’ చిత్రంలో ‘రబ్ కరే, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘ఆజా సోనియే’, దాని రీమిక్స్ వెర్షన్లు, ‘లాహూ బాంకే అన్సూన్’, ‘కార్ డూన్ కమల్’, ‘లాల్ దుపట్టా’తో కలిపి మొత్తం ఏడు పాటలకు సంగీతం సమకూర్చారు. ది కిల్లర్ (2006) ఇమ్రాన్ హష్మి నటించిన ‘ది కిల్లర్’.. సాజిద్-వాజిద్ సోలోగా సంగీతం అందించిన చిత్రం. ఈ సినిమా సంగీతం, పాటలు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇన్ని రోజులు సల్మాన్ ఖాన్ చిత్రాలకు మాత్రమే పని చేస్తారనే విమర్శను ఈ చిత్రం తుడిచేయడమే కాక ఇండస్ట్రీలో వారి స్థానాన్ని సుస్థిరం చేసింది. పార్టనర్(2007) ఈ చిత్రంలోని పాటలు ఇప్పుడు విన్నా.. మనకు తెలియకుండానే కాళ్లు కదుపుతాం. ఈ సినిమాతో సాజిద్-వాజిద్ కీర్తి రెట్టింపు అయ్యింది. ఇదే ఏడాది సాజిద్-వాజిద్ ద్వయం, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, కత్రినా కైఫ్ నటించిన ‘వెల్కమ్’ చిత్రంలోని ఓ పాటకు సంగీతం అందించారు. వాంటెడ్(2009) సల్మాన్ ఖాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సాజిద్-వాజిద్లే సంగీతం సమకూర్చారు. మరోసారి ఈ ముగ్గురి మ్యాజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దబాంగ్(2010) దబాంగ్, దాని తర్వాత వచ్చిన ఈ చిత్ర సీక్వెల్స్ అన్నింటికి సాజిద్-వాజిద్ ద్వయమే సంగీతం సమకూర్చారు. దబాంగ్ చిత్రంలోని ‘మున్ని బద్నామ్ హూయి’ పాట దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హౌస్‌ఫుల్ 2, రౌడీ రాథోడ్ (2012) 2012 ఏడాది అక్షయ్ కుమార్‌తో పాటు సాజిద్-వాజిద్లకు కూడా బాగా కలసి వచ్చింది. ఒక్క ఏడాదిలో అక్షయ్ రెండు బాక్సాఫీస్ హిట్ చిత్రాలను విడుడదల చేస్తే ఈ రెండు చిత్రాలకు సాజిద్-వాజిద్లే సంగీతం సమకూర్చారు. దబాంగ్ 2, ఏక్ థా టైగర్(2012) దబాంగ్ 2 చిత్రంతో సాజిద్-వాజిద్లిద్దరు గేయ రచయితలుగా మారారు. ‘ఫెవికల్ సే’ పాటను ఇద్దరు రచించగా.. వాజిద్ మరో అడుగు ముందుకు వేసి.. గాయకుడి అవతారం ఎత్తారు. చిత్రంలో ‘పాండే జీ సీతి’, ‘ఫెవికోలస్ సే’ పాటలను వాజిద్ పాడారు. అలానే సల్మాన్ ‘ఏక్ థా టైగర్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ మాషల్లా పాటకు వీరు సంగీతం సమకూర్చారు. మే తెరా హీరో, హీరోపంటి (2014) 2014 వచ్చే సరికి సాజిద్-వాజిద్‌లు బాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన ప్రతి అల్బామ్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ క్రమంలో వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన మే తేరా హీరో, టైగర్ ష్రాఫ్ హీరోపంటి చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలానే ఇదే ఏడాది విడుదైలన సల్మాన్ ‘జయహో’ చిత్రానికి వీరు మ్యూజిక్ అందించారు. అయితే సినిమా విజయం సాధించకపోయినప్పటికి.. పాటలు మాత్రం బాగా ప్రసిద్ది చెందాయి. జుడ్వా (2017) సల్మాన్ ఖాన్ ద్విపాత్రిభినయంలో కరిష్మా కపూర్, రంభ జంటగా వచ్చిన ‘జుడ్వా’ చిత్రానికి రిమేక్‌గా ‘జుడ్వా 2’ తెరకెక్కింది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి అను మాలిక్‌తో పాటు సాజిద్-వాజిద్‌లు కూడా సంగీతాన్ని అందించారు. దబాంగ్ 3(2019) ఏడు సంవత్సరాల తర్వాత సల్మాన్ చుల్బుల్ పాండేగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనతో పాటు సంగీత ద్వయం సాజిద్-వాజిద్‌లను కూడా తీసుకొచ్చాడు. ఈ చిత్రానికి వీరిద్దరే సంగీతం సమకూర్చారు. ఈ చ్రితంలో ‘హుద్ హుద్ దబాంగ్’, ‘మున్నీ బద్నామ్’కు కొత్త వర్షన్ ‘మున్నా బద్నాం’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇవేకాక లాక్‌డౌన్‌లోనూ హీరో సల్మాన్ ఖాన్ "భాయ్ భాయ్" పాటకు వాజీద్ సంగీతం అందించారు. -
బాలీవుడ్ స్టార్ హీరో ఔదార్యం
ముంబై : ఆపదలో ఉన్న తన వారికి చేయూత ఇవ్వడంలో ముందుంటారని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో గుండెపోటుకు గురైన దబాంగ్ సహనటుడు దాది పాండేకు బాసటగా నిలిచిన బాలీవుడ్ కండలవీరుడు తన పెద్దమనసు ఏపాటిదో చాటిచెప్పారు. తాను గుండెపోటుతో బాధపడుతూ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందగా తన వైద్య బిల్లులను సల్మాన్ ఖాన్ చెల్లించారని పాండే వెల్లడించారు. సల్మాన్ దయార్ర్ధ హృదయుడని, ఆయన సాయంతోనే తాను ఇప్పుడు కోలుకోగలుగుతున్నానని పాండే చెప్పుకొచ్చారు. గతంలోనూ సల్మాన్ తన సహచర నటులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వారిని ఆదుకున్న ఉదంతాలు ఉన్నాయి. మరోవైపు సల్మాన్ దబాంగ్ 3 నిర్మాణ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. సోనాక్షి సిన్హాతో సల్మాన్ ఆడిపాడనున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఖాళీగా లేను వచ్చేవారం రా!
స్మృతీ ఇరానీ కేంద్ర మంత్రి. కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో స్మృతి ఇప్పుడు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను చూస్తున్నారు. తగిన శాఖే అనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ ప్రసన్నవదనంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. సమస్యను సీరియస్‌గా తీసుకోరు. కానీ సీరియస్‌గా సాల్వ్ చేస్తారు. సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు ఆమె పెడుతుండే పోస్టులు పొట్ట చెక్కలు చేస్తుంటాయి. ఎట్ ద సేమ్ టైమ్.. ఒక జీవిత సత్యాన్ని చెబుతుంటాయి. లేటెస్టుగా నిన్న శనివారం స్మృతి హాయిగా నవ్వించే పోస్టు ఒకటి పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు వీకెండ్స్ కూడా పనిచేస్తుండే వారి మీద! ఆ పోస్టుకు కొద్ది గంటల్లోనే పదివేల లైక్స్ వచ్చాయి. ‘దంగల్’ సినిమాలో ఆమిర్ ఖాన్ ఓ సన్నివేశంలో ‘శభాష్’ అంటాడు. అది బాగా పాపులర్ అయిన సీన్. అలా అంటున్నప్పుడు ఆమిర్ పెట్టిన ఫీలింగ్స్ చూడాల్సిందే. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. కింద ఇలా కామెంట్ రాశారు స్మృతి. ‘‘ఖాళీగా లేను వచ్చేవారం రా.. అని మీరు మీ వీకెండ్‌తో అన్నప్పుడు..’’ అని రాశారు. వీకెండ్‌ని సింబలైజ్ చేస్తూ పైన ఆమిర్ ఫొటో.. శభాష్ అంటూ ఉంటుంది. వీకెండ్లో కూడా బిజీగా ఉండేవాళ్లపై వేసిన ఈ సున్నితమైన సెటైర్ వాళ్లను అర్థం చేసుకుంటూనే, లైఫ్‌కి అంత అవసరం లేదు అని చెప్పినట్లూ ఉంది. ‘‘మీరు మీ ఇన్‌స్టా అకౌంట్‌ని గొప్పగా హ్యాండిల్ చేస్తున్నారు స్మృతీ. ఐ లవ్ ఇట్’’ అని ఒకరు. ‘‘యు ఆర్ సో ఫన్నీ మేమ్’’ అని ఇంకొకరు. ‘‘మీ హాస్య చతురత చంపేస్తోంది’’ అని మరొకరు.. స్మృతి పోస్ట్‌కి కామెంట్స్ పెట్టారు. ప్రొడ్యూజర్ ఏక్తా కపూర్, నటి దివ్యాసేథ్ షా కూడా లైక్ కొట్టారు. ఈ పోస్ట్‌ని చూశాక ఎవరికి మాత్రం వీకెండ్‌ని ఎంజాయ్ చేయాలనిపించదు చెప్పండి. పని కూడా ఎంజాయ్‌మెంటే అనుకునేవాళ్లకు అసలు ప్రాబ్లమే లేదు. -
యూపీ విజార్డ్స్ విజయం
లక్నో: తమ సొంత వేదికపై ఆడిన చివరి మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ 3-2 తేడాతో దబాంగ్ ముంబైపై గెలిచింది. దీంతో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఎనిమిదో నిమిషంలోనే ముంబై ఆటగాడు వికాస్ పిళ్లై గోల్ నమోదు చేశాడు. అయితే 29వ నిమిషంలో నితిన్ తిమ్మయ్య ఫీల్డ్ గోల్‌తో విజార్డ్స్ 1-1తో స్కోరును సమం చేసింది. 44వ నిమిషంలో గ్లెన్ టర్నర్ తిరిగి ముంబైకి ఆధిక్యాన్ని అందించాడు. చివర్లో దూకుడుగా ఆడిన విజార్డ్స్ హర్జీత్ సింగ్, నిక్కిన్ తిమ్మయ్య గోల్స్‌తో గట్టెక్కింది. ఢిల్లీని ఓడించిన కళింగ: హెచ్ఐఎల్ మరో లీగ్ మ్యాచ్‌లో కళింగ లాన్సర్ 2-1 తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. పేలవ ఆటతీరుతో ఇప్పటికే నాకౌట్ అవకాశాలను కోల్పోయిన కళింగ తమ చివరి మ్యాచ్‌లో మెరిసింది. అరన్ జలేస్కి (40వ ని.), రస్సెల్ ఫోర్డ్ (49వ ని) కళింగ తరఫున గోల్స్ చేయగా, ఆండీ హేవార్డ్ (29వ ని.) ఢిల్లీకి ఏకైక గోల్ అందించాడు. -
రెండూ ముఖ్యమే
ముంబై: దబంగ్, రౌడీ రాథోడ్ లాంటి మసాలా సినిమాలతోపాటు నటనకు ఎక్కువ అవకాశం ఉండే లుటేరా వంటి సినిమాలూ తనకు ముఖ్యమేనని సోనాక్షి సిన్హా చెబుతోంది. సల్మాన్ సినిమా దబంగ్‌తో బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె తదనంతరం రౌడీ రాథోడ్, బుల్లెట్‌రాజా, ఆర్..రాజ్‌కుమార్, దబంగ్ 2, సన్ ఆఫ్ సర్దార్ వంటి సినిమాల్లో కనిపించింది. వీటిలో చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న హాలిడే సోనాక్షి తాజా సినిమా. ‘లుటేరా వంటివి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఇలాంటి మంచి స్క్రిప్టు ఉన్నవి చాలా తక్కువగా వస్తాయి. మసాలా సినిమాలను కూడా నేను బాగా ఇష్టపడతాను. ఇలాంటి వాటిలో నటించేందుకు అభ్యంతరం ఏమీ లేదు. ఈ రెండు రకాల సినిమాల మధ్య సమతౌల్యం పాటిస్తాను. కథ ఎంపికలో మనసు చెప్పిందే చేస్తాను. వద్దనుకుంటే తిరస్కరించడానికి వెనుకాడను’ అని చెప్పింది. ఇక హాలీడేలో సోనాక్షి ఆధునిక కాలేజీ యువతిగా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన ఈ సినిమా వచ్చే నెల ఆరున థియేటర్లకు వస్తుంది. ఇందులో పాత్ర తన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, క్రీడాకారిణిగానూ కనిపిస్తానని ఈ బ్యూటీ చెప్పింది. స్కూలు వయసులో చాలా ఆటలు ఆడేదానినని , ఇందులో బాక్సర్ స్టూడెంట్‌గా కనిపిస్తానని తెలిపింది. ఉగ్రవాదం చుట్టూ తిరిగే ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని చెప్పింది. ‘సెలవుల కోసం ఇంటికి వచ్చిన సైనికుడిగా కొన్ని అక్రమాల గురించి తెలుస్తుంది. ప్రాణాలకు తెగించి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హీరోయిన్ బాక్సింగ్ చేయాలి కాబట్టి ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ దగ్గర కొంచెం సాధన కూడా చేశాను. నగర జీవితం నాకు అలవాటే కాబట్టి కాలేజీ యువతి పాత్ర చేయడం పెద్దగా కష్టం అనిపించలేదు’ అని సోనాక్షి సిన్హా వివరించింది.