
ముంబై : ఆపదలో ఉన్న తన వారికి చేయూత ఇవ్వడంలో ముందుంటారని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో గుండెపోటుకు గురైన దబాంగ్ సహనటుడు దాది పాండేకు బాసటగా నిలిచిన బాలీవుడ్ కండలవీరుడు తన పెద్దమనసు ఏపాటిదో చాటిచెప్పారు. తాను గుండెపోటుతో బాధపడుతూ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందగా తన వైద్య బిల్లులను సల్మాన్ ఖాన్ చెల్లించారని పాండే వెల్లడించారు.
సల్మాన్ దయార్ర్ధ హృదయుడని, ఆయన సాయంతోనే తాను ఇప్పుడు కోలుకోగలుగుతున్నానని పాండే చెప్పుకొచ్చారు. గతంలోనూ సల్మాన్ తన సహచర నటులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వారిని ఆదుకున్న ఉదంతాలు ఉన్నాయి. మరోవైపు సల్మాన్ దబాంగ్ 3 నిర్మాణ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. సోనాక్షి సిన్హాతో సల్మాన్ ఆడిపాడనున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment