సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో వ్యాపారి కిడ్నాప్ కథ విషాదంగా మారింది. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని దారుణ హత్యకు గురయ్యారు. ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన ఓ కాలనీ రూపాని డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం మేరకు .. రెండ్రోజుల క్రితం వ్యాపారి విష్ణురూపాని అదృశ్యంపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో ఎస్‌ఆర్ నగర్‌లో అనుమానాస్పద రీతిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు అది విష్ణు రూపానిదేనని నిర్ధారించారు.
పంజాగుట్ట వ్యాపారవేత్త విష్ణు రూపాని కారు ఫైనాన్స్ వ్యవహారమే కిడ్నాప్, హత్యకు దారి తీసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment