Panja gutta
-
వ్యాపారి అదృశ్యం ఘటన విషాదాంతం, శవమై తేలిన విష్ణు రూపాని
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో వ్యాపారి కిడ్నాప్ కథ విషాదంగా మారింది. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని దారుణ హత్యకు గురయ్యారు. ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ కాలనీ రూపాని డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు .. రెండ్రోజుల క్రితం వ్యాపారి విష్ణురూపాని అదృశ్యంపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో ఎస్ఆర్ నగర్లో అనుమానాస్పద రీతిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు అది విష్ణు రూపానిదేనని నిర్ధారించారు.పంజాగుట్ట వ్యాపారవేత్త విష్ణు రూపాని కారు ఫైనాన్స్ వ్యవహారమే కిడ్నాప్, హత్యకు దారి తీసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు. -
నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ
-
‘కాల్పులు జరిపిన వ్యక్తిని చూస్తే గుర్తుపడతా’
హైదరాబాద్: పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సులో గురువారం తుపాకీ కాల్పులు కలకలం రేపిన సంగతి తెల్సిందే. పంజాగుట్ట కాల్పుల ఘటపై ఆర్టీసీ బస్సు కండక్టర్ భూపతి స్పందించారు. కాల్పుల ఘటనపై పోలీసులకు కండక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఘటనపై భూపతి మాట్లాడుతూ..కాల్పులు జరిపినపుడు ఆగంతుకుడు డోర్ వద్ద నిలబడి ఉన్నాడని చెప్పారు. లోపల టికెట్ కలెక్ట్ చేస్తున్న సమయంలో ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చిందని, దీంతో ప్రయాణికులతో పాటు తాము కూడా భయాందోళనకు గురయ్యామని చెప్పారు. పంజాగుట్ట సర్కిల్ దాటిన తర్వాత ఆగంతకుడు బస్సు దిగి వెళ్లిపోయాడని వెల్లడించారు. కాల్పులు జరిపిన వెంటనే తాము ఆర్టీసీ ఉన్నతాధికారుకులకు సమాచారం అందించామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కుతోచక బస్సును డిపోకు తీసుకెళ్లిపోయామని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని చూస్తే గుర్తుపడతానని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో బస్సులో 30 మంది పైనే ప్రయాణికులు ఉన్నారని వివరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ ఆర్టీసీ బస్సులో కాల్పులు గురువారం ఉదయం పదిన్నర నుంచి 11 గంటల మధ్య జరిగిందని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు. ఫుట్‌బోర్డు వద్ద ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగిందని, కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో ఫైరింగ్ కలకలం..! -
మృత్యువుతో పోరాడి ఓడింది
-
మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య
హైదరాబాద్: పంజాగుట్ట కారు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య శనివారం మృతి చెందింది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రమ్య గత 9 రోజులుగా కోమాలో ఉంది. రమ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు పమ్మి రాజేష్(34) కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో అవతలి వైపు నుంచి పీకలదాకా మద్యం సేవించిన యువకులు వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని రాజేష్ కారుపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే కూర్చున్న తండ్రి మధుసూదనాచారి(65) వెన్నుపూస విరగడంతో ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్చారు. కారులో ఉన్న చిన్నారి రమ్య(8)కి తీవ్ర గాయాలు కావడంతో కేర్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లి 9 రోజుల పాటూ మృత్యువుతో పోరాడి ఓడింది. పాప పక్కనే కూర్చొని మొదటి రోజు స్కూల్ కబుర్లు వింటున్న తల్లి రాధిక(32) ఈ ప్రమాదంలో కుడి కాలు విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న మరో సోదరుడు రమేష్(40) ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగి యశోదలో చికిత్స పొందుతున్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య
-
బెంగాల్ వ్యాపారి అవయవదానం
పంజగుట్ట: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారి నగరంలో ఉంటున్న తన కొడుకును చూసేందుకు వచ్చి బాత్రూమ్లో కాలు జారిపడ్డాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అతని అవయవాలు దానం చేసేందు కు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్‌కు చెందిన సోమనాథ్ (64) గచ్చిబౌలిలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న తన కొడుకు నిలంజన్ జానను చూసేందుకు అతని భార్య కల్పనతో కలిసి నగరానికి వచ్చాడు. ఈనెల 11 వ తేదీన సోమనాథ్ బాత్రూమ్లో కాలు జారి పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతనికి ఈనెల 12వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్‌దాన్ బృందం అతని కుటుంబ సభ్యులకు అవయవదానం ఆవశ్యకతను వివరించగా, వారు ఒప్పుకున్నారు. సోమనాథ్‌కు శస్త్రచికిత్సలు నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను భద్రపరిచారు. -
దొరికిపోతామనే లొంగుబాటు!
‘తనిష్క్’ చోరీలో రెండో నిందితుడి అరెస్ట్‌ను చూపిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని తనిష్క్ జ్యువెలరీ షో రూమ్‌లో భారీ దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు ఆనంద్‌ను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం వెల్లడించారు. భవనం వెనుక గోడకు వేసిన రంధ్రం ద్వారా దుకాణంలోకి ప్రవేశించి సొత్తును మూటకట్టింది ఇతడేనని గుర్తించినట్లు తెలిపారు. చోరీ సొత్తు నుంచి రెండు బంగారు గాజుల్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా కలకలం రేగడంతోనే నిందితులు లొంగిపోయారని పేర్కొన్నారు. పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.సత్తయ్య యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన అంశాలివీ.. - తనిష్క్ షోరూమ్‌లో చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఆనంద్ అయినా సూత్రధారి, ప్రేరేపించిన వ్యక్తి కిరణ్‌కుమారే. - షోరూమ్‌కు ఉన్న వెనుక పైపు ‘పాత కిటికీ’ని పగులకొట్టడానికి 3 రోజుల్లో రెండు దఫాలుగా ఆనంద్ ప్రయత్నించాడు. - శనివారం తెల్లవారుజామున షోరూమ్ నుంచి రూ.5.97 కోట్ల విలువైన 851 బంగారు ఆభరణాల్ని మూడు బ్యాగుల్లో సర్దుకున్న ఆనంద్ వాటిని చిన్న సందు ద్వారా ఓ తాడు సాయంతో కిరణ్‌కు అందించగా... అతడు పెద్ద బ్యాగ్‌లో పెట్టాడు. - చోరీ సమయంలో ముఖం దాచుకున్నా కంటిపాపలు సీసీ కెమెరాల్లో రికార్డైతే వాటిని విశ్లేషిస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా కళ్లజోడు ధరించాడు. - తల వెంట్రుకలు రాలిపడితే డీఎన్ఏ ఆధారంగా గుర్తిస్తారనే భయంతో తలకు ప్రత్యేక జెల్ రాసుకున్నాడు. - శని-ఆదివారాల్లో రెండు గాజులు, రెండు ఉంగరాలు అమ్మడానికి నిందితులు యత్నించారు. - తమ ఇంటికి పొరుగున ఉండే పద్మ అనే మహిళ ద్వారా రెండు గాజుల్ని బేగంపేటలోని ఆనంద్ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్‌లో అమ్మేందుకు పంపారు. - ఈ రెండు గాజులు ఒకే జతవి కాకపోవడం, అప్పటికే మీడియాలో ‘తనిష్క్’ వ్యవహారం వెలుగుచూడడంతో యజమాని వాటిని కొనేందుకు తిరస్కరించారు. - దీంతో కంగుతిన్న పద్మ వెనక్కు వచ్చి ఆనంద్, కిరణ్‌లను నిలదీయడంతో ఇద్దరూ కంగారుపడ్డారు. - ఈ పరిణామంతో సొత్తు అమ్మడం తేలికకాదు అని, కచ్చితంగా పోలీసులకు దొరికిపోతామనే భావన ఇద్దరికీ కలిగింది. - 720 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాల్ని ఇచ్చి పారిపోవాల్సిందిగా కిరణ్... ఆనంద్‌కు చెప్పాడు. తర్వాత కిరణ్ మీడియా ద్వారా పోలీసులకు లొంగిపోయాడు. కిరణ్ అరెస్టు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆనంద్ కూడా మరో మీడియా ద్వారా పోలీసులకు లొంగిపోయాడు.