భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.
రతన్ టాటా
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
గౌతమ్ అదానీ
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.
ఇంద్రా నూయీ
1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు.
అర్దేషిర్ గోద్రెజ్
గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment