
సాక్షి, పుత్తూరు : ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ వ్యాపారి ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తీసుకున‍్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. చిత్తూరు జిల్లా పుత్తూరు పట‍్టణం బజారువీధికి చెందిన మదన్ కుమార్ అనే వ్యాపారి ఇటీవల ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. అయితే తాను ఆత‍్మహత‍్య చేసుకునే ముందు తీసుకున‍్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో తనకు ఎవరెవరు అప్పు ఉన్నారో వివరించాడు. అందులో అధికార పార్టీ నేతలు ఉండడం సంచలన రేపుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పుత్తూరు ఎంపీపీ గంజి మాధవయ‍్య రూ.25 లక్షలు, స‍్వర‍్ణకుమారి రూ.5 లక్షలు, పిచ్చాటూరుకు చెందినరో డాక‍్టర్ రూ.50 లక్షలు తనకు బకాయి ఉన్నారని మదన్ కుమార్ ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
వ్యాపారి ఆత‍్మహత‍్య, సెల్ఫీ వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment