య‌జ‌మానులు ఉద్యోగుల‌కు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయ‌న ఇస్తున్నాడు!! | Kerala Businessman Gifts Mercedes Benz Suv To Employee Of 22 Years | Sakshi
Sakshi News home page

య‌జ‌మానులు ఉద్యోగుల‌కు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయ‌న ఇస్తున్నాడు!!

Published Thu, Feb 10 2022 12:41 PM | Last Updated on Thu, Feb 10 2022 2:33 PM

Kerala Businessman Gifts Mercedes Benz Suv To Employee Of 22 Years - Sakshi

కేర‌ళ‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హిత‌,వ‌జ్రాల వ్యాపారి సావ్‌జీ ఢోలాకియాను గుర్తు చేస్తున్నారు. త‌న సంస్థ‌లో పని చేస్తున్న ఉద్యోగుల‌కు బెంజ్ కార్ల‌తో పాటు మ‌రెన్నో బ‌హుమ‌తుల్ని అందిస్తూ హాట్ టాపిగ్గా నిలుస్తున్నారు. 

కేరళకు చెందిన ఏకే షాజీ మైజీ డిజిటల్ రీటైల్ బిజినెస్ నిర్వ‌హిస్తున్నారు. అయితే ఆ సంస్థ‌లో  చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్గా సీఆర్ అనీష్ 22ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గత 22 సంవత్సరాలుగా వ్యాపారవేత్త ఎకె షాజీతో కలిసి పనిచేస్తున్న సీఆర్ అనీష్ విధేయతకు గుర్తుగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ క్లాస్ 220 డి కారును ప్ర‌జెంట్ చేశాడు.  

ఈ సంద‌ర్భంగా  ప్రియమైన అనీ గత 22 సంవత్సరాలుగా  మీరు నాకు బలమైన స్తంభంలా ఉన్నారు. మీరు మీ కొత్త క్రూజింగ్ భాగస్వామిని ప్రేమిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ వ్యాపారవేత్త  ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు బ్లాక్ లగ్జరీ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చిన ఫోటోల్ని జ‌త చేస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. గ‌తంలో ఉద్యోగులకు విశ్వసనీయతకు ప్రతిఫలమివ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం షాజీ తన ఉద్యోగులకు ఆరుగురు చొప్పున కారును బహుమతిగా ఇచ్చాడు. 

కాగా, గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా తన ఉద్యోగులకు విలాసవంతమైన బహుమతుల్ని అందించారు. 018లో దీపావళికి తన ఉద్యోగులకు 600 కార్లు ఇచ్చాడు. 3 కోట్ల విలువైన మూడు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్‌యూవీలను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement