కనీస వేతనం రూ.18 వేలకు పెంచా«లి
Published Fri, Aug 5 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
ఏలూరు (సెంట్రల్) : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, కనీసవేతనాల షెడ్యూల్‌ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్లుగా కార్మికుల కనీస వేతన చట్టాన్ని సవరించని ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్, పి.కిషోర్, చింతకాయల బాబూరావు, ఆర్.లింగరాజు పాల్గొన్నారు.
Advertisement