మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగించాయి. టికెట్ బుకింగ్స్ నుంచి చెక్ ఇన్ వరకు అన్నింటికీ అవాంతరాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.
భారతదేశంలో మాత్రమే కాకుండా.. అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అయింది. క్రౌడ్‌స్ట్రైక్ సమస్యను తామే పరిష్కరిస్తామంటూ వెల్లడించింది. ఈ తరుణంలో అమెరికా ఎమర్జెన్సీ కాలర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య భారతీయ విమాన, ఐటీ సేవలకు మాత్రమే కాకుండా బ్యాంకులు, టెలికాం, మీడియా సంస్థలు కూడా ఈ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి, విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సమస్య ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఎవివిధ రంగాలపై ప్రభావం చూపింది.
బ్రిటన్‌లో విమాన సర్వీసులు మాత్రమే కాకుండా.. రైల్వే, హాస్పిటల్ సర్వీసుల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి. అక్కడి స్కైన్యూస్ ప్రసారాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment