
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళ రహస్యాలను తేల్చే పరిశోధనలో భాగంగా.. పాలపుంతలో గురుత్వాకర్షణ తరంగాల ఆధారాలను కనుగొన్న బృందంలో హైదరాబాద్ ఐఐటీ పరిశోదకులూ భాగస్వాములయ్యారు. ‘ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే (ఐఎన్‌పీటీఏ)’తోపాటు జపాన్, యూరప్ దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారని ఐఐటీ హైదరాబాద్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రపంచంలోని ఆరు అత్యాధునిక రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళాన్ని పరిశీలించామని.. పాలపుంతలో అతి తక్కువ పౌనఃపున్యం ఉన్న గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నామని తెలిపింది. ఈ వివరాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయని పేర్కొంది.
ఐఐటీ హైదరాబాద్ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ శంతన్‌దేశాయ్, అమన్ శ్రీవాత్సవ, ఫిజిక్స్ పీహెచ్‌డీ విద్యార్థి దివ్యనాశ్ కర్బందా, బీటెక్ విద్యార్థులు శ్వేత అర్ముగం, ప్రజ్ఞ మాండిపాక తదితరులు పరిశోధన బృందంలో ఉన్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment