కీటోజెనిక్ లేదా కీటో డైట్‌ని మొట్టమొదటగా 1921లో మూర్చ వ్యాధికి ఉపయోగించేవారు. ఈ డైట్‌లో అధిక కొవ్వు, తగినంత ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఉంటాయి. ఇటీవల అంతా బరవు తగ్గడం కోసి రకరకాల డైట్‌లు ఫాలో అవుతున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఈ డైట్‌తో బరువు తగ్గడం జరుగుతుంది కానీ పరిశోధనలో ఈ డైట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, గట్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయని తేలింది. ఇది అంత ఆరోగ్యకరమైనది కాదని వెల్లడయ్యిందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండటానికి సమహయపడే డైట్‌ని అనుసరించడం ముఖ్యమని చెబుతున్నారు. అసలు ఈ డైట్ ఎలా మంచిది కాదో సవివరంగా చూద్దాం.
కీటో డైట్ ఆరోగ్యానికి సురక్షితమైనదేనా కాదా? అని సుమారు 53 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. వారికి తక్కువ చక్కెరతో కూడిన ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఇవ్వగా వారి శరీరం కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్‌కి బదులుగా కాలేయం నిల్వ చేసిన కొవ్వులను ఇంధనంగా ఉపయోగించుకోవడాన్ని గుర్తించారు. దీన్ని కీటోన్ బాడీల ద్వారా కొవ్వులను కాల్చడం అని అంటారు. ఈ డైట్ ప్రకారం వారంతా 20 నుంచి 50 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి.
ఇలా కీటోసిస్ స్థితికి చేరడానికి కొన్ని రోజుల పడుతుంది. ఇందుకోసం అదిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది హానికరమేనని చెబుతున్నారు. ఇక్కడ కీటోడైట్‌లో తీసుకునే ఆహారాల్లో కొబ్బరి నూనె, వెన్న, చికెన్, గుడ్లు, అని కూరగాయలు, కాయధాన్యాలు, పిండి, వోట్స్, చిక్కుళ్ళు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, గింజలు, కాటేజ్ చీజ్, మేక, ఫెటా చీజ్ తదితరాలు ఉంటాయి. అలాగే ఈ డైట్ కోసం వోట్స్, కేకులు శుద్ధి చేసిన పిండితో చేసిన డెజర్ట్‌లు, అధిక కార్బ్ ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
ఈ కీటో డైట్‌ని అనుసరిచిన 12 వారాల తర్వాత సగటున శరీరంలో 2.9 కిలోల మేర కొవ్వు తగ్గుతుందన పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ చక్కెర నిరోధిత ఆహారం కారణంగా 2.1 కిలోల బరువు కోల్పోయేలా చేస్తుంది. అందువల్లే చాలామంది ఈ డైట్‌ని అనుసరించేందుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైట్ వల్ల కొన్ని ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడించారు పరిశోధకులు.
ఎదురయ్యే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు..
ఈ కీటో డైట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ధమనులలో ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ డైట్‌ని అనుసరించే వారి రక్తంలో అననూకూల స్థాయిలో కొవ్వులు పెరిగినట్లు గుర్తించామన్నారు. ఇలా ఏళ్ల తరబడి ఈ డైట్‌ని ఫాలో అయితే దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారీతీసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ తక్కువ చక్కెర ఆహారం చెడు కొలస్ట్రాల్‌ని గణనీయంగా తగ్గించింది కూడా అని చెప్పారు.
కీటో డైట్ గట్ మైక్రోబయోమ్ కూర్పును మార్చింది. ముఖ్యంగా బిఫిడోబాక్టీరియాను తగ్గిస్తుంది. ప్రోబయోటిక్స్‌లో తరచుగా కనిపించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఇది. ఇది 'బీ' విటమిన్లను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధికారక హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా గట్ బ్యాక్టీరియా తగ్గిపోతే ప్రకోప ప్రేగు వ్యాధి వంటి జీర్ణ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధకత తగ్గి దీర్ఘకాలికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు పరిశోధకులు.
కీటో డైట్ గ్లూకోస్ టాలరెన్స్‌ని తగ్గించింది. అంటే..శరీరం కార్బోహైడ్రేట్‌లను నిర్వహించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఎప్పుడైన అధిక కార్బోహైడ్రేట్ తీసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణలు. ఇక్కడ బరువు తగ్గాలనుకుంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు మంచివే కానీ ఫైబర్‌తో కూడిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు నిపుణులు.
(చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!)
Comments
Please login to add a commentAdd a comment