అద్భుతం.. అన్నదాతల ధాన్యాగారం | Bapatla Agricultural Research Station is of international repute | Sakshi
Sakshi News home page

అద్భుతం.. అన్నదాతల ధాన్యాగారం

Published Sun, Jul 30 2023 4:42 AM | Last Updated on Sun, Jul 30 2023 9:10 AM

Bapatla Agricultural Research Station is of international repute - Sakshi

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అద్భుత ఫలితాలు సాధిస్తూ అన్నదాతల ధాన్యాగారంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతున్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న వరి వంగడాలు నాణ్యమైన అధిక దిగుబడితో దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్నాయి.

ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల వరి వంగడాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాగవుతున్నాయి. విదేశాలకు ఏటా లక్షల టన్నుల బీపీటీ రకాల సన్నబియ్యం ఎగుమతి అవుతూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో ఈ పరిశోధన స్థానం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగసింది.  

వరి పరిశోధన స్థానం నేపథ్యం.. 
1961లో తెనాలిలో ప్రారంభమైన వరిపరిశోధన స్థానం 1973లో బాపట్లకు మార్చారు. అప్పటి నుంచి బాపట్ల వరి పరిశోధన స్థానంగా పనిచేస్తోంది. 2017లో వరి పరిశోధన స్థానం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానంగా అప్‌గ్రేడ్‌ చేస్తూ.. 15 ఎకరాల నుంచి 40 ఎకరాలకు విస్తరించారు. 

కొత్త వంగడాల సృష్టి కేంద్రం..  
1982లో సోనామసూరి రకం ( బీపీటీ 3291), ధాన్యలక్ష్మి (బీపీటీ 1235), 1986లో   సాంబమసూరి (బీపీటీ 5204) అనే సన్న రకం వంగడాన్ని కనుగొన్నారు. 1987లో బీపీటీ 4358, 2001లో బీపీటీ 1768 సన్నాలు, 2010లో బీపీటీ 2270 రకాల వంగడాలను సృష్టించారు. 2010లో బీపీటీ 2231, 2018లో బీపీటీ 2295 రకం ఉత్పత్తి చేయగా 2019లో బీపీటీ 2595  తేజ రకం ఉత్పత్తి చేశారు.

2020లో బీపీటీ 2782 భవతి, బీపీటీ 2411 సశ్య, 2023లో బీపీటీ 3050, బీపీటీ 2846, బీపీటీ 2841 నల్లబియ్యం, బీపీటీ 2848 హైప్రొటీన్‌ రకం వంగడాలను ఉత్పత్తి చేశా­రు. తెగుళ్లను తట్టుకునేలా నా­ణ్యతతో కూడిన విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్లే అధి­క దిగుబడులు సాధ్యమవుతున్నాయని  రైతులు చెబుతు­న్నారు. ఇవి కాకుండా బీ­పీ­టీ 3082, 2858 రకాలు ఉ­త్ప­త్తి అయి మినీకిట్‌ దశలో ఉన్నాయి. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకు.. 
వరి పరిశోధన స్థానం ఏర్పడి ఇప్పటికి 61 ఏళ్లు గడుస్తోంది. 2018 ఏడాది వరకు 57 ఏళ్ల కాలంలో కేవలం 7 వంగడాలను సృష్టించగా.. గడచి­న  4 ఏళ్ల కాలంలోనే 9 రకాల కొత్త వరి వంగడా­లు ఉత్పత్తి చేయడం గమనార్హం. వైఎస్‌ జగన్‌ప్రభుత్వం ప్రోత్సాహం, తోడ్పాటు  వల్లే  త్వరి­తగతిన నూతన వంగడాల సృష్టి సాధ్యమవుతున్నదని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొత్త వంగడాలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన సీడ్‌ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు.  ఏటా 60  ప్రైవేటు కంపెనీలకు సీడ్‌ను అందిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఇక్కడ ఏడాదికి 600 క్వింటాళ్ల బ్రీడర్‌ సీడ్‌ తయారు చేస్తున్నారు.

బీపీటీ విత్తనాల సాగు ఇలా 
బాపట్ల వరి పరిశోధన స్థానంలో సృష్టించిన బీపీటీ 5204 రకం విత్తనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ­వ్యాప్తంగా  సుమారు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో  సాగవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రైతుల కోసం నాణ్యమైన సీడ్‌ 
బాపట్ల వ్యవవసాయ పరిశోధన స్థానంలో నూ­త­­న వరి విత్తనాల ఉత్ప­త్తి జరుగుతున్నది. ఇక్క­డ సృష్టించిన బీపీటీ 5204 రకం దేశవ్యాప్తంగా 75 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండగా.. మరికొ­న్ని రకాల వంగడాలకు డిమాండ్‌ పెరిగింది. ఇవే కాకుండా బ్లాక్‌రైస్, హైప్రొటీన్‌రైస్‌ వంగడాలను సిద్ధం చేశాం. ఇవన్నీ  తెగుళ్లు తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడినిచ్చి రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.  
–బి.కృష్ణవేణి, సీనియర్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్, బాపట్ల వరి పరిశోధన స్థానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement