పచ్చపార్టీలో కేసుల టెన్షన్‌ | MLA Eluri went to dark in black money case | Sakshi
Sakshi News home page

పచ్చపార్టీలో కేసుల టెన్షన్‌

Feb 2 2024 5:48 AM | Updated on Feb 2 2024 1:24 PM

MLA Eluri went to dark in black money case - Sakshi

సాక్షి ప్రతినిధి, బాపట్ల:  మార్టూరులో గ్రానైట్‌ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్‌ అధికారులపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దౌర్జన్యానికి దిగారు. తనిఖీకి వచ్చిన మైనింగ్‌ ఏడీలతోపాటు మిగిలిన అధికారులను దుర్భాషలాడారు.

అంతేకాకుండా తెగించిన పచ్చ ముఠా మైనింగ్‌ అధికారులతో వచ్చిన డ్రైవర్‌  శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు.  దీంతో పోలీసులు మైనింగ్‌ అధికారుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అనుచరులు కామినేని జనార్దన్, చల్లగుండ్ల కృష్ణ, నడింపల్లి హనుమాన్‌ప్రసాద్, ఎస్‌.ఏ.రజాక్, మిన్నేకంటి రవి, అడుసుమల్లి వెంకట శ్రీనివాసరావు, పత్తిపాటి సురేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులపై  కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో చల్లగుండ్ల కృష్ణ, ఎమ్మెల్యే ఏలూరిని మినహా మిగిలిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌చేసి బుధవారం అద్దంకి కోర్టులో హాజరు పర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఎమ్మెల్యే ఏలూరితోపాటు చల్లగుండ్ల కృష్ణ పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. ఏలూరి ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం ప్రయతి్నస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు.  

ఆందోళనలో ఎమ్మెల్యే ­అనుచరులు  
ఎమ్మెల్యే ఏలూరి అక్రమాలకు దన్నుగా నిలిచిన పుణ్యానికి పోలీసు కేసులు పెట్టించుకొని ఆయన కంపెనీ ఉద్యోగులు, అనుచరులు లబోదిబోమంటున్నారు. నోవా అగ్రిటెక్‌ మాటున నల్లధనంతో ఎన్నికల్లో దొంగ ఓట్లు, ఓట్ల కొనుగోలు ఇతర అక్రమాలకు పాల్పడ్డారు. గ్రానైట్‌ అక్రమ రవాణాపై ఫిర్యాదులతో తనిఖీకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్‌ అధికారులపై ఎమ్మెల్యే ఆదేశాలతో దాడులు చేసి కేసులు పెట్టించుకోవాల్సి రావడంతో గ్రానైట్‌ వ్యాపారులు, అనుచరులు లబోదిబోమంటున్నా­రు.

 గొడవ పడింది సాక్షాత్తూ మైనింగ్, విజిలెన్స్‌ అధికారులతో కావడంతో ఇక నుంచి రాయల్టీ, జీఎస్టీలు లేకుండా గ్రానైట్‌ రవాణా వ్యాపారం ఎలా చేయాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు. చేసేది అక్రమ రవాణా కావడంతో మైనింగ్‌ అధికారుల కన్ను దాడిచేసిన తమపైనే ఉంటుందని వ్యా­పా­రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులతో పెట్టుకుని అందరినీ ఇబ్బందులకు గురిచేశారంటూ మిగిలిన గ్రానైట్‌ వ్యాపారులు ఏలూరికి మద్దతు పలికిన వ్యాపారులను  చీవాట్లు పెడుతున్నారు.  

ఏ–1గా ఏలూరి సాంబశివరావు
ఎమ్మెల్యే ఏలూరి రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లధనంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు బయటపడటంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన కంపెనీ ఉద్యోగులు పలువురిపై  కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని నోవా అగ్రిటెక్‌ కార్యాలయంలో గత నెల 24న జీఎస్టీకి సంబంధించి రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌( ఏపీఎస్‌ డీఆర్‌ఐ) అధికారులు జరిపిన తనిఖీల్లో అక్రమాలకు సంబంధించి వివరాలున్న డైరీలు బయటపడ్డాయి. ఏలూరి పెద్దఎత్తున నల్లధనాన్ని వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది.

పూర్తిస్థాయి విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తా­యని భావించిన అధికారులు ఎమ్మెల్యే, కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ–1 గా ఉన్నారు. ఆయనతోపాటు కంపెనీ ఉద్యోగులు పుల్లెల అజయ్‌బాబు, అప్పారావు, బాజిబాబు, సాయి­గణేశ్‌లపైనా ఇంకొల్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం నోటీసులు ఇచ్చి వీరిని విచారించనున్నారు. తొలుత పట్టుబడ్డ డైరీని స్వా«దీనం చేసుకొని దాంట్లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు విచారణలో ముందుకెళ్లనున్నారు.    

బయటపడుతున్న అక్రమాల చిట్టా 
ఎన్నికల వేళ ఏలూరి అక్రమాలు వెలుగు చూడటంపై ముఖ్యంగా టీడీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నా­యి. ఏలూరి అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయ­టç­³డటం నష్టం చేకూరుస్తుందని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలే దొంగ ఓట్ల పుణ్యమాని గత రెండు ఎన్నికల్లో  అతితక్కువ మెజార్టీతో బయట పడ్డామని, ఈసారి  నియోజకవర్గంలో 12 వేలకు పైగా దొంగ ఓట్లు తొలగింపుతో గెలిచే పరి­స్థితి లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement