YSRCP Bus Yatra: మనకు మళ్లీ జగనన్నే కావాలి | YSRCP Samajika Sadhikara Bus Yatra And Sabha In Bapatla - Sakshi
Sakshi News home page

YSRCP Bus Yatra: మనకు మళ్లీ జగనన్నే కావాలి

Published Sat, Oct 28 2023 6:43 PM | Last Updated on Sat, Oct 28 2023 7:13 PM

YSRCP Bus Yatra And Sabha In Bapatla - Sakshi

సాక్షి, బాపట్ల:  వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు బాపట్లలో నిర్వహించిన సభలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించారు. ఈ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి నేతలు మాట్లాడారు.

మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ..  ‘వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర చేపడితే నారా లోకేష్‌ ఇది గాలి యాత్ర అంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. లోకేష్‌ ఇది గాలి యాత్ర కాదు.. దండయాత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మన సామాజిక యాత్రను చులకనగా మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్టీలను తేలిక చేసి మాట్లాడుతున్న లోకేష్‌కు గుణపాఠం చెబుదాం. సీఎం జగన్‌ను పీకేస్తాం.. తేల్చేస్తాం అంటూ ఏదో చెత్త వాగుడు వాగుతున్నారు. సీఎం జగన్‌ ఏమైనా మొక్క అనుకున్నారా.. పీకేయడానికి. సీఎం జగన్‌ ఒక వీరుడు, ధీరుడు, దమ్మున్న నాయకుడు’ అని మరోసారి స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యే పోతుల సునీత మాట్లాడుతూ.. ‘సామాజిక సాధికారితకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు మన సీఎం జగనన్న. సామాజిక సాధికారితతో ఒక ఉద్యమాన్ని సృష్టించారు.అంబేద్కర్‌, పూలే, అల్లూరి సీతారామారాజు స్ఫూర్తితో, వైఎస్సార్‌ ఆశయాలతో సామాజిక సాధికారితకు శ్రీకారం చుట్టారు మన జగనన్న.పేదలకు కష్టాల్లో అండగా నిలబడి అందరికి నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. మహిళా సాధికారితకు కూడా సీఎం జగన్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

గత ప్రభుత్వం మహిళలను ఓటు బ్యాంకుగా చూసేరే కానీ మహిళా సాధికారిత గురించి ఏనాడు ఆలోచించలేదు.చంద్రబాబువి మోసపూరిత హామీలే. గత ప్రభుత్వ పాలనకు నేటి పాలనకు తేడా గమనించండి. అందరికీ అండగా నిలబడ్డ మన జగనన్న మళ్లీ రావాలి

ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి గారు మన జీవితాల్ని బాగు చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు. అటువంటి నాయకుడ్ని వదులుకోవద్దు. మన బీసీల్ని, మన ఎస్సీల్ని పార్లమెంట్‌లో కూర్చోబెట్టిన నాయకుడు సీఎం జగన్‌. బీసీల్ని, ఎస్సీల్ని చులకనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. మనకు జగనన్న మాత్రమే కావాలి.. ఇంకో నాయకుడు అవసరం లేదు’ అని నొక్కి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement