Granite factory
-
పచ్చపార్టీలో కేసుల టెన్షన్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దౌర్జన్యానికి దిగారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీలతోపాటు మిగిలిన అధికారులను దుర్భాషలాడారు. అంతేకాకుండా తెగించిన పచ్చ ముఠా మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అనుచరులు కామినేని జనార్దన్, చల్లగుండ్ల కృష్ణ, నడింపల్లి హనుమాన్‌ప్రసాద్, ఎస్.ఏ.రజాక్, మిన్నేకంటి రవి, అడుసుమల్లి వెంకట శ్రీనివాసరావు, పత్తిపాటి సురేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చల్లగుండ్ల కృష్ణ, ఎమ్మెల్యే ఏలూరిని మినహా మిగిలిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌చేసి బుధవారం అద్దంకి కోర్టులో హాజరు పర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎమ్మెల్యే ఏలూరితోపాటు చల్లగుండ్ల కృష్ణ పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. ఏలూరి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయతి్నస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఆందోళనలో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఏలూరి అక్రమాలకు దన్నుగా నిలిచిన పుణ్యానికి పోలీసు కేసులు పెట్టించుకొని ఆయన కంపెనీ ఉద్యోగులు, అనుచరులు లబోదిబోమంటున్నారు. నోవా అగ్రిటెక్ మాటున నల్లధనంతో ఎన్నికల్లో దొంగ ఓట్లు, ఓట్ల కొనుగోలు ఇతర అక్రమాలకు పాల్పడ్డారు. గ్రానైట్ అక్రమ రవాణాపై ఫిర్యాదులతో తనిఖీకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే ఆదేశాలతో దాడులు చేసి కేసులు పెట్టించుకోవాల్సి రావడంతో గ్రానైట్ వ్యాపారులు, అనుచరులు లబోదిబోమంటున్నారు. గొడవ పడింది సాక్షాత్తూ మైనింగ్, విజిలెన్స్ అధికారులతో కావడంతో ఇక నుంచి రాయల్టీ, జీఎస్టీలు లేకుండా గ్రానైట్ రవాణా వ్యాపారం ఎలా చేయాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు. చేసేది అక్రమ రవాణా కావడంతో మైనింగ్ అధికారుల కన్ను దాడిచేసిన తమపైనే ఉంటుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులతో పెట్టుకుని అందరినీ ఇబ్బందులకు గురిచేశారంటూ మిగిలిన గ్రానైట్ వ్యాపారులు ఏలూరికి మద్దతు పలికిన వ్యాపారులను చీవాట్లు పెడుతున్నారు. ఏ–1గా ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యే ఏలూరి రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లధనంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలు బయటపడటంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన కంపెనీ ఉద్యోగులు పలువురిపై కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కార్యాలయంలో గత నెల 24న జీఎస్టీకి సంబంధించి రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్( ఏపీఎస్ డీఆర్ఐ) అధికారులు జరిపిన తనిఖీల్లో అక్రమాలకు సంబంధించి వివరాలున్న డైరీలు బయటపడ్డాయి. ఏలూరి పెద్దఎత్తున నల్లధనాన్ని వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని భావించిన అధికారులు ఎమ్మెల్యే, కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ–1 గా ఉన్నారు. ఆయనతోపాటు కంపెనీ ఉద్యోగులు పుల్లెల అజయ్‌బాబు, అప్పారావు, బాజిబాబు, సాయిగణేశ్లపైనా ఇంకొల్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం నోటీసులు ఇచ్చి వీరిని విచారించనున్నారు. తొలుత పట్టుబడ్డ డైరీని స్వా«దీనం చేసుకొని దాంట్లో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు విచారణలో ముందుకెళ్లనున్నారు. బయటపడుతున్న అక్రమాల చిట్టా ఎన్నికల వేళ ఏలూరి అక్రమాలు వెలుగు చూడటంపై ముఖ్యంగా టీడీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. ఏలూరి అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటç³డటం నష్టం చేకూరుస్తుందని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలే దొంగ ఓట్ల పుణ్యమాని గత రెండు ఎన్నికల్లో అతితక్కువ మెజార్టీతో బయట పడ్డామని, ఈసారి నియోజకవర్గంలో 12 వేలకు పైగా దొంగ ఓట్లు తొలగింపుతో గెలిచే పరిస్థితి లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/మార్టూరు: నోవా అగ్రిటెక్ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్ విజిలెన్స్ అధికారులపై తన అనుచరులతో పాటు ఏకంగా దాడికి పాల్పడ్డారు. గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలు చేయనిచ్చేది లేదంటూ తొలుత అధికారులను అడ్డగించారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీతోపాటు మిగిలిన అధికారులనూ దుర్భాషలాడారు. మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. గౌరవప్రదమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి పరిశ్రమలను తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులపై బరితెగించి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారు. విచారణ జరిగితే అక్రమాలు వెలుగుచూస్తాయన్నా భయంతోనే ఏలూరి దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే మార్టూరు గ్రానైట్ పరిశ్రమల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో నెల్లూరు మైనింగ్ విజిలెన్స్ ఏడీ బాలాజీనాయక్, మచిలీపట్నం మైనింగ్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం తనిఖీల నిమిత్తం మార్టూరుకు వచ్చారు. బాలాజీనాయక్ బృందం బల్లికురవ మండలం వేమవర వద్ద ఉన్న ఎమ్మెల్యే ఏలూరి అనుచరుడు కోటపాటి సురేష్‌కు చెందిన రెండు ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించగా మచిలీపట్నం ఏడీ ప్రతాప్‌రెడ్డి మార్టూరులోని ఏలూరి మరో అనుచరుడు కామినేని జనార్దన్‌కు చెందిన ఫ్యాక్టరీలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని మార్టూరులోనే ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తెలియజేయడంతో అనుచరులతో సహా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏడీ ప్రతాప్‌రెడ్డిని ఎలా తనిఖీలు చేస్తారంటూ నిలదీశారు. తనిఖీలు చేస్తామంటే చూస్తూ ఉరుకునేది లేదంటూ గొడవకు దిగాడు. అనుచరులతో కలిసి అధికారులను దుర్భాషలాడారు. వారిపై జులుం ప్రదర్శించారు. ఏడీ ప్రతాప్‌రెడ్డిపై జరుగుతున్న దౌర్జన్యం చూసి అడ్డుకోబోయిన డ్రైవర్ శ్రీనివాసరావుపై ఏలూరి అనుచరులు దాడికి దిగారు. అతనిని ఇష్టానుసారం కొట్టారు. ఫ్యాక్టరీ ఆవరణలోని ఓ గదిలో బంధించారు. ఎమ్మెల్యే, అనుచరులపై కేసులు నమోదు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నరసింహారావు మంగళవారం రాత్రి తెలిపారు. ఏలూరి సాంబశివరావు, ప్రత్తిపాటి సురేష్, చల్లగుండ్ల కృష్ణ, దివ్య ప్రసాద్, షేక్ అబ్దుల్ రజాక్, మిన్నెకంటి రవి, అడుసుమల్లి శ్రీనివాసరావు, నడింపల్లి హనుమాన్ ప్రసాద్, మరికొందరిపై మైనింగ్ ఏడీ ఆర్ ప్రతాప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. వీరిపై ఐపీసీ 341, 353, 323, 324, 427, 386, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. -
పారిశ్రామిక ప్రగతి పరుగులు
ఏ పరిశ్రమ ఏర్పాటు కావాలన్నా అనుకూల వాతావరణంతోపాటు రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. ఇవన్నీ పుష్కలంగా ఉన్నచోట పరిశ్రమల ఏర్పాటుకు ఢోకా ఉండదు. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా దొరుకుతాయి. పై అంశాలన్నీ సమృద్ధిగా ఉన్న జిల్లాలోని మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. మనుబోలు: గత కొన్నేళ్లుగా మనుబోలు మండలంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. దీంతో స్థానికంగా ఉండే వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మండల పరిధిలో 10 కిలోమీటర్లకు పైగా విస్తరించిన జాతీయ రహదారి, 15 కిలోమీటర్ల దూరంలో కృష్టపట్నం పోర్టు, స్థానికంగా రైల్వేస్టేషన్, 140 కిలోమీటర్ల దూరంలో చైన్నె మహానగరం ఉన్నాయి. దీంతో రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండడంతో పలు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో బయట నుంచి వచ్చి చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారిని మనుబోలు మండలం విశేషంగా ఆకర్షిస్తోంది. 70 శాతానికి పైగా స్థానికులే.. మనుబోలు మండల పరిధిలో పల్లవ గ్రానైట్ ఫ్యాక్టరీ, 765 కేవీ, 400 కేవీ పవర్ గ్రిడ్స్, ట్రాన్స్‌కో 400 కేవీ సబ్ స్టేషన్, జీడిపప్పు ఫ్యాక్టరీ, ఎస్వీఎస్ మినరల్స్, అట్టపెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీ, మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ ఉన్నాయి. అలాగే హైవేకు ఇరువైపులా 5 పెట్రోల్ బంకులు, 4 దాబా హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. పవర్ గ్రిడ్ మినహా మిగిలిన పరిశ్రమల్లో 70 శాతానికి పైగా స్థానికులే పనిచేస్తున్నారు. వీటితోపాటు త్వరలో శ్రీచక్ర ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద పాలిస్టర్ పరిశ్రమ, ఎ టూ బి రెస్టారెంట్స్, ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ సెంటర్, స్టార్ బగ్స్లతోపాటు మరికొన్ని ఫ్రాంచైజీలు మండలంలో ఏర్పాటు కానున్నాయి. తద్వారా వందలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. అన్నివిధాలా అనుకూలం మూడేళ్ల క్రితం మనుబోలు మండలంలోని అక్కంపేట సమీపంలో రోడ్డు పక్కన అకాజు ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. ముడి జీడి గింజలను దక్షణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటాం. హైవేకు దగ్గరగా ఉండడంతోపాటు కృష్ణపట్నం పోర్టు, చైన్నె పోర్ట్‌లకు కూడా రవాణా సౌకర్యం సులభతరంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. మా పరిశ్రమలో ప్రస్తుతం 60 మంది పనిచేస్తున్నారు. అందరూ స్థానికులే. భవిష్యత్‌లో యూనిట్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నాం. – ఆర్.శివాజీ, మేనేజింగ్ పార్టనర్, అకాజు ప్రాసెసింగ్ (ప్ర) లిమిటెడ్ మా కళ్ల ముందే ఎంతో మారిపోయింది మనుబోలు మండలం ఇటీవల కాలంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో వ్యవసాయ భూముల ధరలు కూడా బాగా పెరిగాయి. ఇతర దేశాలు, రాష్టాల నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకోవాలన్నా, ఇక్కడ తయారైన ఉత్పత్తులను వాటిని ఎగుమతి చేయాలన్నా రవాణా సౌకర్యం ఎంతో ముఖ్యం. మనుబోలుకు హైవే, కృష్ణపట్నం, చైన్నై పోర్టులు, రైల్వేస్టేషన్ అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలు అధికంగా ఏర్పాటవుతున్నాయి. – వెందోటి భాస్కర్‌రెడ్డి, రైతు,జట్ల కొండూరు అనుకూల వాతావరణం మనుబోలు మండలంలో అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉండడంతోనే పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయని తెలుస్తోంది. రవాణా సౌకర్యాలతోపాటు పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహాయ సహకారాలు ఉండడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతోమంది ముందుకొస్తున్నారని తెలుస్తోంది. -
గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
-
గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
-
తండ్రి కొట్టాడని అలిగెళ్లి.. పాతికేళ్లకు మళ్లీ!
సాక్షి, ఖమ్మం (రఘునాథపాలెం): తండ్రి కొట్టాడని అలిగి పదేళ్లప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు. వందల కిలో మీటర్ల దూరం దాటి పక్క రాష్ట్రానికి చేరాడు. పాతికేళ్ల తర్వాత తల్లిని, తండ్రిని చూడాలని తపిం చి తిరిగి వచ్చాడు. కానీ, తండ్రి లేడు. క్షణికావే శంలో దూరం చేసుకున్న తండ్రి ఇక ఎంతకాలానికైనా తిరిగి రాడని తెలిసి తల్లడిల్లిపోతున్నాడు. వివ రాలు... ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన దొంతు నాగమణి, సత్యనారాయణ అనే రైతు దంపతులు 25 ఏళ్ల క్రితం ఓ గుర్తు తెలియని పదేళ్ల అబ్బాయిని చేరదీశారు. రమేశ్ అని పేరు పెట్టారు. పెద్దయ్యాక అదే మండలం మల్లేపల్లికి చెందిన లక్ష్మి అనే యువతితో పెళ్లి చేశారు. రమేశ్ దంపతులకిప్పుడు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. మల్లేపల్లి సమీపంలోని యాకూబ్ కాలనీలో ఉంటూ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. జన్మస్థలం గురించి ఆరా తీసి..: రమేశ్ ఇప్పుడు ఖమ్మంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ యజమాని భార్య, కుమారుడికి రమేశ్ తన చిన్నప్పటి సంగతులను అప్పుడప్పుడు చెబుతుండేవాడు. తన తల్లిదండ్రులు, మూర్తి, మున్నెమ్మ, అన్న కార్తీక్, తమ్ముడు ప్రభు, చెల్లి నయాని ఎలా ఉన్నారోనని బెంగటిల్లెవాడు. దీంతో కంపెనీ యజమాని కొడుకు అతడి జన్మస్థలం గురించి ఆరా తీశాడు. రమేశ్ తెలిపిన వివరాల మేరకు కంపెనీ యజమాని కొడుకు తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా అంబూరి మండలం కదవాల గ్రామంలో విచారణ చేయించాడు. ఆ గ్రామ రేషన్ దుకాణంలో ఉన్న జాబితా ద్వారా చిన్నప్పటి ఫొటోను.. ఇప్పటి రమేష్ ఫొటోను సరిచూశాడు. తమ కుమారుడు పదేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాడని, ఆ ఫొటోలో ఉన్నది తమవాడేనని తల్లి, సోదరులు నిర్ధారించారు. గత ఆదివారం తమిళనాడులోని తన జన్మస్థలానికి వెళ్లాడు. తల్లిని, చెల్లిని, ఇద్దరు సోదరులను కలుసుకున్నాడు. తండ్రి రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడని తెలుసుకొని చలించిపోయాడు. తల్లిని, చెల్లిని, బావను, చెల్లి పిల్లలను తనతోపాటు యాకూబ్నగర్ తీసుకొచ్చాడు. అయితే, అతడు తెలుగు మాత్రమే మాట్లాడటం.. తల్లి, చెల్లి, బావలకు తమిళం తప్ప తెలుగు భాష రాకపోవడంతో వారితో రమేశ్ సైగలు చేస్తూ వ్యవహరిస్తున్నాడు. -
ఉపాధికి దెబ్బ!
► సమ్మెతో స్తంభించిన గ్రానైట్ పరిశ్రమ ►తొలి రోజు నిలిచిన రూ.6 కోట్లకు పైగా లావాదేవీలు ►40 వేల మంది కార్మికులకు ఉపాధికి విఘాతం ►ఫ్యాక్టరీలు మూత పడటంతో జిల్లాలో పుష్కలంగా విద్యుత్ ఒంగోలు క్రైం : జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత పడటంతో పరిశ్రమ స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వటంతో సోమవారం మొదటి రోజు జిల్లాలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడ్డారుు. ఒక రోజు సమ్మెతో జిల్లా మొత్తం మీద దాదాపు రూ.6 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయారుు. గ్రానైట్ ఫ్యాక్టరీలు చీమకుర్తి, మద్దిపాడు, మార్టూరు, బల్లికురవ మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నడుస్తున్నారుు. జిల్లాలో దాదాపు 1150కు పైగా ఫ్యాక్టరీలు నడుస్తున్నారుు. నెలకు దాదాపు రూ.150 కోట్లకు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగుతుంటారుు. అంటే రోజుకు రూ.5 కోట్ల మేర లావాదేవీలు సాగుతున్నాయన్న మాట. ఇవికాక కార్మికులకు కూలీలు, ఉద్యోగులకు జీతాల రూపంలో, విద్యుత్ బిల్లుల రూపంలో రోజుకు రూ.కోటికి పైగా లావాదేవీలు కొనసాగుతారుు. మొదటి రోజు ఉపాధికి దెబ్బ! సమ్మె సందర్భంగా చీమకుర్తిలో ఫ్యాక్టరీ యజమానులు ఆందోళన చేపట్టారు. యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయల్టీ విధానం వల్ల యజమానులకు ఎలాంటి ప్రయోజనం లేకపోవటమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్దగా ఒరిగేదేమిలేదని యజమానులు అంటున్నారు. డీఎంఎఫ్‌ను కలుపుకొని రాయల్టీ మొత్తం 57 శాతం యజమానులు కట్టాలంటే ఏవిధంగా సాధ్యమని నోరెళ్లబెడుతున్నారు. దీంతో పరిశ్రమ పూర్తిగా అంపశయ్య ఎక్కే పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. విద్యుత్ సంస్థకూ భారీ నష్టం.. జిల్లాలో ఒక్క గ్రానైట్ పరిశ్రమ ద్వారానే 40 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఇంత పెద్ద మొత్తంలో ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను దెబ్బతీయటం ప్రభుత్వాలకు పరిపాటి కాదని యజమానులు ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలోని కార్మికులతో పాటు ఉభయ రాష్ట్రాలు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని వేలాది మంది స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులు ఉపాధిని నిలువునా దెబ్బతీసినట్లేనని అర్ధమవుతోంది. విద్యుత్ బిల్లులు ఒక్క రోజుకు అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలకు కలిపి రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు బిల్లులు కట్టాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత పడటంతో మొదటి రోజు సమ్మె ద్వారా పుష్కలంగా మిగులు విద్యుత్ ఉన్నట్లరుుంది. దీంతో విద్యుత్ సంస్థకు కూడా భారీ స్థారుులో నష్టం వాటిల్లినట్లయింది. -
సమర్పిస్తేనే సర్వే..
ప్రైవేటు వ్యక్తులతో దందా రైతులను పీక్కుతింటున్న వైనం సర్వేయర్ల వ్యవహారంతో వేలాది మంది ఇక్కట్లు అద్దెయ్య ఓ సన్నకారు రైతు. తన పొలం పక్కనే ఇటీవల ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వెలిసింది. అద్దెయ్యకు చెందిన కొంత భూమిని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమించింది. పొలాన్ని సర్వే చేసి న్యాయం చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆరు నెలలు గడిచింది. కొలతలు వేసి హద్దులు నిర్ణయించాల్సిన సర్వేయర్ ఇంతవరకూ పొలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరో వైపు ఫ్యాక్టరీ యాజమాన్యం అంతకంతకూ అద్దెయ్య పొలాన్ని ఆక్రమిస్తూ వ స్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యంతో సర్వేయర్ కుమ్మక్కై తనకు అన్యాయం చేస్తున్నారని అద్దెయ్య ఆరోపిస్తున్నారు. ఇది ఒక్క అద్దెయ్య సమస్యే కాదు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు సర్వేయర్ల వ్యవహారంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎంతోకొంత సమర్పిస్తేనే తప్పా సర్వేయర్లు సీటు కదిలి రాని పరిస్థితి నెలకొంది.. నాదెండ్ల: చిలకలూరిపేట మండలానికి చెందిన ఓ సర్వేయర్ అయితే రాజదర్పం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను తనకు సహాయకులుగా నియమించుకుని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టిన రోజు వేడుకలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ రాజకీయవేత్త మాదిరి పట్టణమంతా ఫ్లెక్సీలు వెలిశాయి. నాదెండ్ల మండలంలో కొద్ది రోజుల కిందట వరకూ పనిచేసిన ఓ సర్వేయర్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నిర్వహించిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో రైతులు సంబంధిత సర్వేయర్‌పై ఫిర్యాదులు చేశారు. అతని అనుయాయులే ఒక్కో పనికి ఇంత అని నిర్ణయించి రైతుల నుంచి వసూలు చేసేవారు. ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావటంతో వేరే మండలానికి బదిలీ చేశారు. సర్వే చేసేందుకంటూ డబ్బులు సమర్పించుకున్న రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఒక సర్వేయర్ రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాళ్ళరిగేలా తిరిగినా కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడని అంటున్నారు.రేపల్లె నియోజకవర్గంలో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ముందు వారి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. మంగళగిరి, అమరావతి, తుళ్లూరు, తాడికొండ లాంటి సీఆర్డీఏ పరిధిలోని మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి రైతుల అగచాట్లు ఏ రోజు ఆయా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లినా దర్శనమిస్తూనే ఉంటాయి. మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ మండల కార్యాలయంలో ఓ రైతు అక్కడి సర్వేయర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆరు నెలలుగా సర్వేయర్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. తన పొలం కొలిచిన పాపానపోవడం లేదని తీవ్రంగా మండిపడ్డాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలను పీక్కుతింటున్నారు... సర్వేయర్లు లంచాల ఊబిలో కూరుకుపోయారనడానికి జిల్లాలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోతున్నా.. ఏ ఒక్క ఉన్నతాధికారీ వీరి గురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఎందరో సర్వేయర్లు అనతి కాలంలోనే సంపన్నులుగా మారిపోతున్నా.. ఏసీబీ అధికారులకూ కన్పించడం లేదు. రైతులకు న్యాయం చేయాల్సిన సర్వేయర్లు లంచాలతో పీక్కుతింటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒక్కో సర్వేయర్ నలుగురుకి మించి ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని దందా చేస్తున్నారు. ఎకరా పొలం కొలత వేయాలంటే రూ.5 వేలు లంచం ఇస్తేనే స్పందిస్తారు. -
కిరణ్ పాలనకు మూడేళ్లు
కిరణ్ పాలనకు మూడేళ్లు =సీఎంగా జిల్లాకు అందని వరాలు =చివరి నిమిషంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన =జిల్లాలో అధ్వానంగా రోడ్ల పరిస్థితి =కదలని గాలేరు-నగరి, హంద్రీ-నీవా పనులు =చలికాలంలోనూ తాగునీటికి ట్యాంకర్లే గతి =పెండింగ్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం సాక్షి, చిత్తూరు: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారానికి మూడేళ్లు అయ్యింది. ఈ కాలంలో ఆయన సొంత జిల్లాకు చేసిందేమీ లేదని చెప్పవచ్చు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గ ఓటు బ్యాంక్‌ను పదిలపరుచుకునేందుకు అనుసరించిన మార్గంలోనే కిరణ్ సైతం నడిచారు. ఆయన తన సొంత నియోజకవర్గం పీలేరుకు నిధులన్నీ తరలించడం, అక్కడ కాంట్రాక్టర్లకు కాసులు రాలే విధంగా పనులు ఇవ్వడం మినహా జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించినది ఏమీలేదు. పీలేరు పట్టణం చుట్టుపక్కల కొండలు, గుట్టలనూ వదలకుండా భూబకాసురులు కబ్జా చేశారు. ముందుకు సాగని పనులు జిల్లాకు సాగునీటి వనరులు లేవు. పడమటి మండలాల్లో రైతులు 1000 నుంచి 1500 అడుగుల వరకు బోర్లు వేసి అరకొర నీటితో పంటలు పండిస్తున్నారు. పశ్చిమాన హంద్రీనీవా, తూర్పున గాలేరు నగరి ప్రాజెక్ట్‌లు పూర్తయితే కృష్ణా మిగులు జలాలతో చిత్తూరు జిల్లా సాగుభూములు సస్యశ్యామలమవుతాయి. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌లు భూసేకరణ, నిధుల కొరత కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. హంద్రీనీవాకు సంబంధించి మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల్లో కాలువలు తవ్వి వదిలేశారు. వీటిని చెరువులతో అనుసంధానించడం, ఎత్తిపోతల పథకాల ద్వారా అనంతపురం జిల్లా నుంచి కృష్ణా జలాలు అందించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షానికి ఈ కాలువలో నిలిచిన నీటితో రైతులు సంతృప్తి పడాల్సి వస్తోంది. గాలేరు నగరి కాలువకు సంబంధించి వైఎస్సార్ జిల్లాలో టన్నెల్ తవ్వకం, రేణిగుంట, పుత్తూరు, వడమాలపేట, ఆర్.సి.పురం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, చెరువుల అనుసంధాన పనులు ప్రారంభం కాలేదు. కాలువల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు. అక్కడక్కడా కాలువలు తవ్వి వదిలేశారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు అవసరమైన నిధులు విడుదల కాలేదు. కడప, అనంతపురం జిల్లాల్లో పనులకు నిధులు విడుదల చేసి గాలేరు-నగరి, హంద్రీనీవాకు నిధులు ఇచ్చామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి మూడేళ్లలో ఒక అడుగూ ముందుకు పడలేదు. జిల్లాలో వెయ్యికిపైగా చెరువులను అనుసంధానించి వర్షాకాలంలో వీటిల్లోకి పుష్కలంగా నీరు చేరే విధంగా వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ను సీఎం కిరణ్ పక్కన పెట్టేశారు. మైక్రో ఇరిగేషన్ కింద చేపట్టిన ఈ పథకం నిధుల కేటాయింపు, సరైన పర్యవేక్షణ లేక పెండింగ్‌లో పడింది. ప్రస్తుతం కట్టలు, తూముల మరమ్మతులకు మాత్రం నిధులు విడుదల చేశారు. అధ్వానంగా రోడ్లు కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో కొత్తగా వేసిన రోడ్లు ఏమీలేవు. పలమనేరు-క్రిష్ణగిరి, రాణిపేట-పలమనేరు నేషనల్ హైవేలతోపాటు నాయుడుపేట-పూతలపట్టు స్టేట్ హైవే గుంతలమయంగా మారింది. పలమనేరు నేషనల్ హైవేను నాలుగులైన్ల రోడ్డుగా మార్చేందుకు భూసేకరణ పనులు ప్రారంభం కాలేదు. తిరుపతి-పీలేరు-మదనపల్లె రోడ్డు నిర్మాణం చేపట్టినా అది పూర్తి కాలేదు. చిత్తూరు- తిరుపతి రహదారి అధ్వానస్థితిలో ఉంది. ఈ మార్గంలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అవసరం. ఈ ప్రతిపాదనలు మూడేళ్లుగా మోక్షం లేదు. మొత్తం మీద సీఎం కిరణ్ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కటకట జిల్లాలో నేటికీ 17 మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. చివరి నిమిషంలో హడావుడిగా శంకుస్థాపన చేసిన రూ.7,200 కోట్ల కండలేరు మంచినీటి పథకం ప్రధానంగా పీలేరు దాహార్తిని తీర్చే విధంగా డిజైన్ చేశారు. అక్కడ నుంచి పడమటి మండలాలకు తాగునీరు ఇస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నిధుల సమీకరణ సమస్యగా ఉంది. ఇది ఎన్నికల ప్రచారం కోసం వాడుకునేందుకు మిగిలింది. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న పీలేరు పట్టణంలోనూ ప్రజలు బిం దె నీటిని రూ.4 చెల్లించి కొనుక్కుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో తాగునీటి సమస్య రాజ్యమేలుతోంది. చిత్తూరు, తిరుపతి, పుంగనూరు, మదనపల్లె వంటి ప్రధాన పట్టణాల్లోనూ జనం చలికాలంలో సైతం తాగునీటికి కటకటలాడుతున్నారు.