ఉపాధికి దెబ్బ!
► సమ్మెతో స్తంభించిన గ్రానైట్ పరిశ్రమ
►తొలి రోజు నిలిచిన రూ.6 కోట్లకు పైగా లావాదేవీలు
►40 వేల మంది కార్మికులకు ఉపాధికి విఘాతం
►ఫ్యాక్టరీలు మూత పడటంతో జిల్లాలో పుష్కలంగా విద్యుత్
ఒంగోలు క్రైం : జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత పడటంతో పరిశ్రమ స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వటంతో సోమవారం మొదటి రోజు జిల్లాలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడ్డారుు. ఒక రోజు సమ్మెతో జిల్లా మొత్తం మీద దాదాపు రూ.6 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయారుు. గ్రానైట్ ఫ్యాక్టరీలు చీమకుర్తి, మద్దిపాడు, మార్టూరు, బల్లికురవ మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నడుస్తున్నారుు. జిల్లాలో దాదాపు 1150కు పైగా ఫ్యాక్టరీలు నడుస్తున్నారుు. నెలకు దాదాపు రూ.150 కోట్లకు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగుతుంటారుు. అంటే రోజుకు రూ.5 కోట్ల మేర లావాదేవీలు సాగుతున్నాయన్న మాట. ఇవికాక కార్మికులకు కూలీలు, ఉద్యోగులకు జీతాల రూపంలో, విద్యుత్ బిల్లుల రూపంలో రోజుకు రూ.కోటికి పైగా లావాదేవీలు కొనసాగుతారుు. మొదటి రోజు
ఉపాధికి దెబ్బ!
సమ్మె సందర్భంగా చీమకుర్తిలో ఫ్యాక్టరీ యజమానులు ఆందోళన చేపట్టారు. యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయల్టీ విధానం వల్ల యజమానులకు ఎలాంటి ప్రయోజనం లేకపోవటమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్దగా ఒరిగేదేమిలేదని యజమానులు అంటున్నారు. డీఎంఎఫ్‌ను కలుపుకొని రాయల్టీ మొత్తం 57 శాతం యజమానులు కట్టాలంటే ఏవిధంగా సాధ్యమని నోరెళ్లబెడుతున్నారు. దీంతో పరిశ్రమ పూర్తిగా అంపశయ్య ఎక్కే పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు.
విద్యుత్ సంస్థకూ భారీ నష్టం..
జిల్లాలో ఒక్క గ్రానైట్ పరిశ్రమ ద్వారానే 40 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఇంత పెద్ద మొత్తంలో ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను దెబ్బతీయటం ప్రభుత్వాలకు పరిపాటి కాదని యజమానులు ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలోని కార్మికులతో పాటు ఉభయ రాష్ట్రాలు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని వేలాది మంది స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులు ఉపాధిని నిలువునా దెబ్బతీసినట్లేనని అర్ధమవుతోంది. విద్యుత్ బిల్లులు ఒక్క రోజుకు అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలకు కలిపి రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు బిల్లులు కట్టాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత పడటంతో మొదటి రోజు సమ్మె ద్వారా పుష్కలంగా మిగులు విద్యుత్ ఉన్నట్లరుుంది. దీంతో విద్యుత్ సంస్థకు కూడా భారీ స్థారుులో నష్టం వాటిల్లినట్లయింది.