power company
-
చంద్రబాబు బెదిరింపులతో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
-
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్‌కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్‌కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్‌ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
సాధారణ స్థితికి విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/కాకినాడ/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వస్తోంది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి అవకాశంలేని చోట్ల తాత్కాలిక చర్యలతో విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో గురువారం సాయంత్రానికి రాష్ట్రమంతటా దాదాపు 98 శాతం విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. మిచాంగ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థల ప్రయత్నాలు ఫలించాయి. ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన పునరుద్ధరణ.. ఏపీఎస్పీడీసీఎల్లో 231 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 17 ఫీడర్లు ప్రభావితం కాగా, ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని ఫీడర్లు గురువారం రాత్రికి పునరుద్ధరించారు. నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్లలో దెబ్బతిన్న మూడు ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు 269, 33 కేవీ ఫీడర్లు 145, 33 కేవీ ఫీడర్లు, 32 కేవీ స్తంభాలు 770, 11 కేవీ 2,341 స్తంభాలు, 247 డీటీఆర్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. నెల్లూరు సర్కిల్లో 33/11కేవి సబ్స్టేషన్లు 36 పూర్తిగా చెడిపోగా, పునరుద్ధరించారు. రూ.1,235.45 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో 33 కేవి సబ్స్టేషన్లు 150, 33 కేవీ ఫీడర్లు 134, 33 కేవీ పోల్స్ 16, 11కేవీ పోల్స్ 514, 173 డీటీఆర్లు దెబ్బతినగా, అన్నిటినీ సాధారణ స్థితికి తెచ్చారు. డిస్కం మొత్తం మీద రూ.545.98 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు సర్కిళ్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 204, 33కేవీ ఫీడర్లు 147, 33 కేవీ స్తంభాలు 115, 11కేవీ పోల్స్ 1,247, డీటీఆర్లు 504 పాడవ్వగా, అన్నిటినీ బాగుచేశారు. రూ.1,995.57 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. -
పేదోడి కరెంట్ బిల్లు పైసా పెరగదు
సాక్షి, అమరావతి: పేదలు, అల్పాదాయ వర్గాల కరెంట్ బిల్లులు ఈ ఏడాది పైసా కూడా పెరిగే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలపై పడే రూ.10,060.63 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ.1,707.07 కోట్లను గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందన్నారు. ఇంతకాలం రకరకాల పద్ధతుల్లో ఉన్న పరోక్ష విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల కోరిక మేరకు ఎత్తేశామని చెప్పారు. కొత్త టారిఫ్ రూపకల్పనలో కమిషన్ పాత్రపై జస్టిస్ నాగార్జునరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పెంచలేదు.. తగ్గేలా చేశాం రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడకం ఉన్నవారు 50.90 లక్షల మంది. వీరికి గతంలోనూ, ఇప్పుడూ వచ్చే కరెంట్ బిల్లు (యూనిట్ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50. ఇక నెలకు 51–75 యూనిట్ల విద్యుత్ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు. వీరికి గతంలో రూ. 137.50 బిల్లు వచ్చేది.. ఇప్పుడూ అంతే. (50 యూనిట్ల వరకూ యూనిట్ రూ.1.45.. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్ రూ.2.60 చొప్పున). అంటే.. దాదాపు 74 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్ బిల్లు పెరిగే ప్రసక్తే లేదు. నెలకు 75 యూనిట్లు దాటిన వారి విషయంలో బిల్లు స్వల్పంగా పెరిగినట్టే ఉన్నా.. గతంలోని పరోక్ష విధానాన్ని విశ్లేషించి చూస్తే వారిలో సగం మందికి కరెంట్ బిల్లులు తగ్గే వీలుంది. ఏ విధంగా అంటే.. 100 యూనిట్ల వరకూ పాత బిల్లు ప్రకారం.. (0–50 వరకూ యూనిట్ రూ.1.45... 51–100 వరకూ యూనిట్‌కు రూ.2.60 చొప్పున) నెలకు రూ.202.50 వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. (0–100 వరకూ యూనిట్ రూ.2.60 చొప్పున) రూ.260 బిల్లు వస్తుంది. అంటే.. రూ. 57.50 పెరిగినట్టు కనిపించినా వాస్తవంలో ఇది తగ్గుతుంది. మారిన శ్లాబ్ ప్రకారం ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే కాబట్టి కరెంట్ బిల్లులు తగ్గుతాయి. నెలకు 101–200 యూనిట్లు వాడే వాళ్లు రాష్ట్రంలో 37.28 లక్షల మంది ఉన్నారు. 201–225 యూనిట్లు వాడేవారు 6.28 లక్షల మంది. వీరి వినియోగం తగ్గితే తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. కాబట్టి పేద వర్గాలపై ఎంతమాత్రం భారం పడలేదు. 500 యూనిట్లపైన వాడేవారు 1.35 లక్షల మంది ఉన్నారు. అధిక సంపన్నులైన వీరికి పెరిగింది కేవలం యూనిట్‌కు రూ.90 పైసలే. గత ఐదేళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే ఉచిత కరెంటు, తదితరాలకు డిస్కమ్‌లు భరించే భారాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వాటికి ఇవ్వాలి. అయితే.. 2015–16లో రూ.3,600 కోట్ల సబ్సిడీకి రూ.3,186 కోట్లు, 2016–17లో రూ.3,951 కోట్లకు రూ.2,923 కోట్లు, 2017–18లో రూ.3,700 కోట్లకు.. రూ.2750 కోట్లు, 2018–19లో రూ.6,030 కోట్లకు రూ.1,250 కోట్లు, 2019–20లో రూ.8,255 కోట్లకు రూ.4,667 కోట్లు మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇతరత్రా పేరుకు పోయి.. అప్పులు చేసిన డిస్కమ్‌లు వడ్డీలకే నెలకు రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి వస్తోంది. పరిశ్రమలకు చేయూత.. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వ పథకాల కోసం నాణ్యమైన బియ్యం ఆడించే రైసు మిల్లులకు వినియోగం లోడ్ పరిమితిని వంద నుంచి 150 హెచ్‌పీకి పెంచాం. అనేక పరిశ్రమలకు లోడ్‌ఫ్యాక్టర్ ఇన్సెంటివ్స్ (ఎక్కువ వినియోగానికి రాయితీలు) కొనసాగిస్తున్నాం. ఫెర్రో అల్లాయిస్‌ను బతికించేందుకు 85 శాతం లోడ్ ఫ్యాక్టర్ నిబంధనల ప్రతిపాదనను పక్కనపెట్టాం. కుటీర పరిశ్రమలపై కెపాసిటర్లు లేవని విద్యుత్ సిబ్బంది వేసే జరిమానాలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాం. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు నూతన టారిఫ్ వల్ల భారీ ప్రయోజనం కలుగుతుంది. ఏ లాభాపేక్ష లేని ఈ సంస్థలను వాణిజ్య కేటగిరీలోంచి తీసేశాం. విద్యుత్ సంస్థలను ప్రజలకు చేరువ చేయాలన్న కమిషన్ ఆలోచనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ, గతంలో లేని విధంగా గృహ విద్యుత్ వినియోగ సబ్సిడీ రూ.1,707.07 కోట్లు ఇచ్చింది. దీనికి వ్యవసాయ సబ్సిడీ (రూ.8,353.58 కోట్లు) కలిపితే మొత్తం ఇచ్చింది రూ.10,060.63 కోట్లు. -
‘విద్యుత్ సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల సాధారణ బదిలీల్లో బీసీ ఉద్యోగులను ప్రాధాన్యతా స్థానాల్లో నియమించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కృష్ణయ్య నేతృత్వంలో విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో సీఎండీ, డైరెక్టర్ స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని బీసీలను సీఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని కోరారు. ఆర్.కృష్ణయ్య వెంట విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమారస్వామి, వెంకన్నగౌడ్, యాదగిరి, చంద్రుడు, గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఉపాధికి దెబ్బ!
► సమ్మెతో స్తంభించిన గ్రానైట్ పరిశ్రమ ►తొలి రోజు నిలిచిన రూ.6 కోట్లకు పైగా లావాదేవీలు ►40 వేల మంది కార్మికులకు ఉపాధికి విఘాతం ►ఫ్యాక్టరీలు మూత పడటంతో జిల్లాలో పుష్కలంగా విద్యుత్ ఒంగోలు క్రైం : జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత పడటంతో పరిశ్రమ స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వటంతో సోమవారం మొదటి రోజు జిల్లాలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడ్డారుు. ఒక రోజు సమ్మెతో జిల్లా మొత్తం మీద దాదాపు రూ.6 కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయారుు. గ్రానైట్ ఫ్యాక్టరీలు చీమకుర్తి, మద్దిపాడు, మార్టూరు, బల్లికురవ మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నడుస్తున్నారుు. జిల్లాలో దాదాపు 1150కు పైగా ఫ్యాక్టరీలు నడుస్తున్నారుు. నెలకు దాదాపు రూ.150 కోట్లకు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగుతుంటారుు. అంటే రోజుకు రూ.5 కోట్ల మేర లావాదేవీలు సాగుతున్నాయన్న మాట. ఇవికాక కార్మికులకు కూలీలు, ఉద్యోగులకు జీతాల రూపంలో, విద్యుత్ బిల్లుల రూపంలో రోజుకు రూ.కోటికి పైగా లావాదేవీలు కొనసాగుతారుు. మొదటి రోజు ఉపాధికి దెబ్బ! సమ్మె సందర్భంగా చీమకుర్తిలో ఫ్యాక్టరీ యజమానులు ఆందోళన చేపట్టారు. యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయల్టీ విధానం వల్ల యజమానులకు ఎలాంటి ప్రయోజనం లేకపోవటమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్దగా ఒరిగేదేమిలేదని యజమానులు అంటున్నారు. డీఎంఎఫ్‌ను కలుపుకొని రాయల్టీ మొత్తం 57 శాతం యజమానులు కట్టాలంటే ఏవిధంగా సాధ్యమని నోరెళ్లబెడుతున్నారు. దీంతో పరిశ్రమ పూర్తిగా అంపశయ్య ఎక్కే పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. విద్యుత్ సంస్థకూ భారీ నష్టం.. జిల్లాలో ఒక్క గ్రానైట్ పరిశ్రమ ద్వారానే 40 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఇంత పెద్ద మొత్తంలో ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను దెబ్బతీయటం ప్రభుత్వాలకు పరిపాటి కాదని యజమానులు ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలోని కార్మికులతో పాటు ఉభయ రాష్ట్రాలు, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని వేలాది మంది స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులు ఉపాధిని నిలువునా దెబ్బతీసినట్లేనని అర్ధమవుతోంది. విద్యుత్ బిల్లులు ఒక్క రోజుకు అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలకు కలిపి రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు బిల్లులు కట్టాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత పడటంతో మొదటి రోజు సమ్మె ద్వారా పుష్కలంగా మిగులు విద్యుత్ ఉన్నట్లరుుంది. దీంతో విద్యుత్ సంస్థకు కూడా భారీ స్థారుులో నష్టం వాటిల్లినట్లయింది.