శివాలెత్తిన శివమ్‌ దూబే.. వరల్డ్‌ కప్‌ టికెట్‌ పక్కా? వీడియో వైరల్‌ | Shivam Dube hits hat-trick of sixes against LSG | Sakshi
Sakshi News home page

#Shivam Dube: శివాలెత్తిన శివమ్‌ దూబే.. వరల్డ్‌ కప్‌ టికెట్‌ పక్కా? వీడియో వైరల్‌

Published Tue, Apr 23 2024 10:58 PM | Last Updated on Tue, Apr 23 2024 11:22 PM

Shivam Dube hits hat-trick of sixes against LSG - Sakshi

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే మరోసారి సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పుడూ స్పిన్నర్లను టార్గెట్‌ చేసే దూబే.. ఈ మ్యాచ్‌లో మాత్రం లక్నో ఫాస్ట్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.

ముఖ్యంగా లక్నో పేసర్‌ యష్‌ ఠాకూర్‌ను దూబే ఓ ఆట ఆడుకున్నాడు. 16 ఓవర్‌ వేసిన యష్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దూబే.. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు దూబేకు టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో కచ్చితంగా చోటుదక్కుతుందని కామెంట్లు చేస్తున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో దూబే అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 51.83 సగటుతో 311 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో హార్దిక్‌ పాండ్యా స్ధానంలో దూబేకు ఛాన్స్‌ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement