IPL 2023 CSK Vs DC: Netizens Showering Praises On Shivam Dube Masterclass Batting Attack - Sakshi
Sakshi News home page

IPL 2023 CSK Vs DC: జట్టుకు పట్టిన దరిద్రం అన్నారు.. ఇప్పుడెమో చుక్కలు చూపిస్తున్నాడు!

Published Thu, May 11 2023 12:55 PM | Last Updated on Thu, May 11 2023 1:46 PM

Netizens praises shivam dube masterclass batting attack - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభంలో ఆకట్టుకోకపోయినా సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దుబే.. ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతున్నాడు. సీఎస్‌కే ప్రతీ విజయంలోనూ దుబే తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న సమయంలో క్రీజులోకి వచ్చిన దుబే.. బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దుబే.. 3 సిక్స్‌లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అప్పటివరకు స్లోగా సాగిన సీఎస్‌కే ఇన్నింగ్స్‌.. దుబే సూపర్‌ బ్యాటింగ్‌తో ఊపందుకుంది. అనంతరం జడేజా, ధోని బ్యాట్‌కు పనిచెప్పడం సీఎస్‌కే 167 పరుగుల స్కోర్‌ సాధించగల్గింది. 

ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన దుబే.. 159.9 స్ట్రైక్‌ రేట్‌తో 315 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు దుబే 11 ఫోర్లు, 27 సిక్సర్లు బాదాడు. ఇక సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దుబేపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

"జట్టుకు పట్టిన దరిద్రం అన్నారు.. ఇప్పడు ఏమో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు" అని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక శివమ్‌ దుబే కొట్టిన సిక్సర్లే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కూడా తెలిపాడు.
చదవండిWC 2023: భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ కాదు.. వరల్డ్‌కప్‌ విజేత ఆ జట్టే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement