ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జాన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 షురూ కానుంది. ఈ ఏడాది పొట్టిప్రపంచకప్‌నకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి ప్రకటించే అవకాశముంది.
ఈ నేపథ్యంలో భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఎవరుండాలన్న అన్న విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్ పాండ్యాకు కాకుండా ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ ఇవ్వాలని తివారీ సూచించాడు.
"హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్‌గా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ చేయాలి. గత మూడు మ్యాచ్‌ల నుంచి హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. అంతకముందు బౌలింగ్ చేసినా దాదాపు 11 పైగా ఏకనామీతో పరుగులు సమర్పించుకున్నాడు.
హార్దిక్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పుకోవాలి. అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. శివమ్ దూబే కచ్చితంగా సెలక్టర్ల దృష్టిలో ఉంటాడని నేను భావిస్తున్నాను.
ఒక వేళ టీ20 ప్రపంచకప్ జట్టులో దూబేకు చోటు దక్కకపోతే అందుకు బాధ్యత సీఎస్‌కే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు. హార్దిక్‌కు ప్రత్నామ్యాయంగా దూబేను సెలక్టర్లు ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో శివమ్ దూబే దుమ్ములేపుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లలో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment