ఐపీఎల్-2024లో టీమిండియా ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివమ్ దూబే వరుసగా రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ లీగ్ ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే.. స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.
దూబే గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం వరుసగా ఇది రెండో సారి. అంతకముందు కూడా చెపాక్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దూబే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
స్పిన్నర్లను అద్భుతంగా ఆడిగల్గే దూబే.. అదే స్నిన్నర్ల బౌలింగ్‌లో ఔట్ అవుతుండడం సీఎస్‌కే అభిమానులను కలవరపెడతోంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శర కనబరచడంతో దూబేకు టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీకి ముందు దూబే వరుసగా విఫలం కావడడం జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.
Wickets ki aayi bahar, jaise hi aaye Rahul Chahar 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvCSK #IPLinPunjabi pic.twitter.com/urm9eFIDOW
— JioCinema (@JioCinema) May 5, 2024
Comments
Please login to add a commentAdd a comment