
ఐపీఎల్-2024 ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. స్పిన్నర్లు అద్బుతంగా ఎదుర్కొంటాడని పేరొందిన దూబే.. ఇప్పుడు అదే స్పిన్ బౌలింగ్ అతడి వీక్‌నెస్‌గా మారింది.
మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్‌కేకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడడంతో ఏకంగా అతడికి టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో సెలక్టర్లు చోటు ఇచ్చారు. కానీ వరల్డ్‌కప్‌నకు ఎంపికైన తర్వాత అతడి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆడుతున్నది నిజంగా దూబేనేనా అన్నట్లు ఉంది.
తొలి 9 మ్యాచ్ ల్లో 172.4 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేసిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. తొలి 9 మ్యాచ్ ల్లో ఏకంగా 26 సిక్సర్లు బాదిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దూబే 15 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు శివమ్ దూబే ఫామ్ భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. అయితే వరల్డ్‌కప్ ప్రకటించిన జట్టులో మే 25లోపు మార్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిజర్వ్ జాబితాలో ఉన్న రింకూకు ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేసి.. మెయిన్ జట్టులో ఉన్న దూబేకు స్టాండ్‌బై లిస్ట్‌లోకి డిమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment