
న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు.

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్‌ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది.

రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు.





























