ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తొలిసారి నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. రహానే ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే.. తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.
స్పిన్‌ను అద్బుతంగా ఆడే దూబే.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హార్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ కావడం గమనార్హం. 9వ ఓవర్ వేసిన హార్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో దూబే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఐపీఎల్‌లో దూబే గోల్డన్ డక్‌గా వెనుదిరిగడం ఇదే మొదటి సారి. కాగా ఈ ఏడాది సీజన్‌లో దూబే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శన కారణంగానే టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో దూబేకు చోటు దక్కింది.
అయితే టీ20 వరల్డ్‌కప్‌కు ప్రకటించిన తర్వాత రోజే దూబే డకౌట్ కావడం గమనార్హం. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 171.57 స్ట్రైక్ రేటుతో 350 పరుగులు చేశాడు.
Double strike from Harpreet Brar 🔥#TATAIPL #CSKvPBKS #IPLonJioCinema #IPLinHindi pic.twitter.com/O5lVM6nog2
— JioCinema (@JioCinema) May 1, 2024
Comments
Please login to add a commentAdd a comment