IPL 2022, CSK Vs GT: Ravindra Jadeja, Lose Cool As Shivam Dube Fails To Take David Miller's Catch - Sakshi
Sakshi News home page

IPL 2022: క్యాచ్‌ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన జ‌డేజా.. వీడియో వైర‌ల్‌

Published Mon, Apr 18 2022 9:48 AM | Last Updated on Mon, Apr 18 2022 11:07 AM

 Ravindra Jadeja, lose Cool as Shivam Dube fails to take David Millers Catch - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓట‌మి చెందింది.  కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్  కింగ్స్ కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా తన ప్రశాంతతను కోల్పోయాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ 17 ఓవ‌ర్‌లో డ్వేన్ బ్రావో వేసిన స్లో డెలివరీని డీప్ మిడ్ వికెట్ దిశ‌గా బౌండ‌రీ బాదేందుకు డేవిడ్ మిల్ల‌ర్ ప్ర‌య‌త్నించాడు.

అయితే షాట్ కనెక్ష‌న్ స‌రిగ్గా కుద‌ర‌క‌పోవ‌డంతో డిప్ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ దుబేవైపు బంతి వెళ్లింది. అయితే ఫ్లడ్‌లైట్‌లు కార‌ణంగా దుబే క‌నీసం బంతిని ప‌ట్టే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఇది కెప్టెన్ జ‌డేజా, బ్రావోకి కోపం తెప్పిచింది. దీంతో అస‌హనానికి గురైన‌ జ‌డేజా త‌న క్యాప్‌ను తీసి నెల‌కేసి కొట్ట‌బోయాడు. కానీ చివరికి తన భావోద్వేగాలను జ‌డేజా కంట్రోల్ చేసుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా డేవిడ్ మిల్ల‌ర్ ఈ మ్యాచ్‌లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడి గుజ‌రాత్‌ను విజ‌య తీరాల‌కు చేర్చాడు. 51 బంతుల్లో మిల్ల‌ర్ 94 ప‌రుగులు సాధించి అజేయంగా నిలిచాడు.

చ‌ద‌వండి: IPL 2022:"అత‌డు అద్భుత‌మైన బౌల‌ర్‌.. త్వ‌ర‌లోనే భార‌త‌ జ‌ట్టులోకి వ‌స్తాడు"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement