
PC:IPL.com
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన దూబే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లకు దూబే చుక్కలు చూపించాడు. బౌలర్ ఎవరన్నది సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు.
ముఖ్యంగా స్పిన్నర్లను అయితే ఊచకోత కోశాడు. కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. గతేడాది సీజన్‌లో కూడా దూబే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
సీఎస్‌కే బ్యాటర్లలో దూబేతో పాటు రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు.
Shivam Smashing Dube at work in Chepauk! #IPL2024 #CSKvsGT pic.twitter.com/7lTRzlhy7y
— OneCricket (@OneCricketApp) March 26, 2024